Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ దెబ్బ.. ఐపీఎల్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం?

బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ వరకు కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, ఇంకా గాయం నుంచి బుమ్రా కోలుకోలేదు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి.

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ దెబ్బ.. ఐపీఎల్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం?

Jasprit Bumrah: మరో నెల రోజుల్లో ఐపీఎల్ ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది.

Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం.. వైరల్ అవుతున్న వీడియో!

బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ వరకు కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, ఇంకా గాయం నుంచి బుమ్రా కోలుకోలేదు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇది ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే ముంబై ఇండియన్స్‌కు ప్రధాన బౌలర్‌గా ఉన్న బుమ్రా, ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా ఐపీఎల్ మాత్రమే కాకుండా, ఆ తర్వాత జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా ఆడే అవకాశం లేదు.

TS Group-2: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ 7న ఓవల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ ఫైనల్‌కు భారత జట్టు దాదాపు అర్హత సాధించే అవకాశం ఉంది. ఇటీవలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత జట్టు అద్భుత విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బుమ్రాకు బీసీసీఐకి చెందిన వైద్య బృందం ప్రత్యేకంగా చికిత్స అందిస్తోంది. బెంగళూరులో అతడికి చికిత్స కొనసాగుతోంది. బుమ్రాకు సర్జరీ అవసరమని బీసీసీఐ వైద్యులు సూచించారు. రాబోయే రోజుల్లో అతడి చికిత్స ఎలా కొనసాగింది.. ఎంత వరకు కోలుకున్నాడు అనే అంశాలపై ఈ సర్జరీ ఆధారపడి ఉంటుంది. గత ఆగష్టులో జరిగిన ఆసియా కప్ నుంచి బుమ్రా జట్టుకు దూరమయ్యాడు.