Hyderabad T20 Match Fever : హైదరాబాద్‌లో టీ20 మ్యాచ్ ఫీవర్.. ఫైనల్ ఫైట్‌కు సర్వం సిద్ధం.. టీమిండియా గెలుపొందాలంటే

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఫైట్.. ఫైనల్ కు చేరింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తుది పోరులో తలపడనున్నాయి.

Hyderabad T20 Match Fever : హైదరాబాద్‌లో టీ20 మ్యాచ్ ఫీవర్.. ఫైనల్ ఫైట్‌కు సర్వం సిద్ధం.. టీమిండియా గెలుపొందాలంటే

Hyderabad T20 Match Fever : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఫైట్.. ఫైనల్ కు చేరింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తుది పోరులో తలపడనున్నాయి. మూడు టీ20 మ్యాచుల ఈ సిరీస్ లో భారత్-ఆసీస్ చెరో విజయంతో ఉన్నాయి. ఉప్పల్ లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. దీంతో ఎలాగైనా ఫైనల్ ఫైట్ లో గెలిచి సిరీస్ ఎగరేసుకుపోవాలని అటు రోహిత్ సేన, ఇటు ఫించ్ సేనలు వ్యూహ రచన చేస్తున్నాయి. దీంతో చివరి టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

తొలి మ్యాచ్ లో భారీ పరుగులు చేసినప్పటికీ బౌలింగ్ లో విఫలం కావడంతో టీమిండియా ఓటమిపాలైంది. రెండో టీ20 మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆసీస్ ను చిత్తు చేసి సిరీస్ రేసులో నిలిచింది. ఈ క్రమంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ ఫైట్ పై ఇరు జట్లు కన్నేశాయి.

ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. దీంతో రేపటి మ్యాచ్ లో పరుగుల వరద పారనుంది. బౌండరీలు, సిక్సర్ల మోత మోగనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో టీ20 ఫీవర్ జోరుగా వ్యాపించింది. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు.. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్ లోనూ రాణించాల్సిందే. ఆసీస్ కు ఏ మాత్రం చాన్స్ ఇచ్చినా సిరీస్ ను కోల్పోవడం ఖాయం. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ పటిష్టంగానే ఉంది. తొలి టీ20లో అట్టర్ ఫ్లాప్ అయిన భారత బౌలర్లు రెండో మ్యాచ్ లో కాస్తంత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. తొలి రెండు మ్యాచుల్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ సూపర్ గా బౌలింగ్ చేశాడు.

చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన యార్కర్ కింగ్ బుమ్రా రాకతో ఇండియన్ బౌలింగ్ విభాగానికి బలం వచ్చినట్లు అయ్యింది. అయితే, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా ఎంపిక చేసిన హర్షల్ పటేల్ మాత్రం ప్రదర్శన మాత్రం ఆందోళనకరంగానే ఉంది. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని అంచనాలు పెట్టుకున్నా హర్షల్ పటేల్ మాత్రం తేలిపోతున్నాడు. రెండు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలం అయ్యాడు.

మరో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయితే బుమ్రా రాకతో డెత్ ఓవర్లలో ఆసీస్ కు అడ్డుకట్ట పడే చాన్స్ ఉంది. అక్షర్ పటేల్ మినహా మిగతా బౌలర్లు చాహల్, ఉమేష్ యాదవ్, హార్దిక్ పెద్దగా రాణించలేదు. దీంతో కీలకమైన మూడో మ్యాచ్ కి చాహల్ ని పక్కన పెట్టే అవకాశం ఉంది. చాహల్ స్థానంలో మరో స్పిన్నర్ అశ్విన్ ను తీసుకునే చాన్స్ ఉంది.