Virat Kohli: ప్లేయర్‌లా ఉన్నప్పటికీ కెప్టెన్‌లాగే ఆడతా- విరాట్ కోహ్లీ

టీం కోసం ప్లేయర్ లా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నానని, గతంలో చాలా మంది కెప్టెన్ల కింద ఆడగలిగానని అంటున్నాడు. టీం ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్తున్నాడు.

Virat Kohli: ప్లేయర్‌లా ఉన్నప్పటికీ కెప్టెన్‌లాగే ఆడతా- విరాట్ కోహ్లీ

Kohli

Virat Kohli: స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తాను కెప్టెన్ గా వైదొలగాడని సరైన సమయమిదేనంటూ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. టీం కోసం ప్లేయర్ లా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నానని, గతంలో చాలా మంది కెప్టెన్ల కింద ఆడగలిగానని అంటున్నాడు. టీం ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్తున్నాడు.

ఏడేళ్ల పాటు కెప్టెన్సీ వహించి రాజీనామా ప్రకటించిన కోహ్లీ.. 68టెస్టుల్లో 40విజయాలు నమోదు చేశాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత అక్టోబరులో టీ20 కెప్టెన్సీకి విరామం ప్రకటించి.. కొన్ని రోజులకు వన్డే, టెస్టు ఫార్మాట్లకు సైతం వీడ్కోలు పలికేశాడు.

‘ముందుగా మీరేం సాధించలనుకుంటున్నారో తెలుసుకోవలి. ప్రతి దానికి ఒక సమయం నిర్దేశించుకోవాలి. బ్యాట్స్ మన్ గా టీం కోసం చాలా ఇవ్వగలం. లీడర్ అవడానికి కెప్టెన్ అయ్యే ఉండాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ధోనీ టీంలో ఉన్నప్పుడు లీడర్ గా కాదు. ఒక వ్యక్తిలాగే కావాల్సిన సహకారం అందించేవాడు.

Read Also: కోహ్లీ విజయాలను జీర్ణించుకోలేకే ఇలా.. – రవి శాస్త్రి

గెలవడం, ఓడిపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి రోజూ అద్భుతంగా ప్రదర్శించేందుకే కష్టపడాలి. తక్కువకాలంలోనే ఏదో చేసేయాలనుకోకూడదు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడిన సమయంలోనూ కెప్టెన్ లాగే ఆలోచించేవాడ్ని. టీంలో ఉన్నప్పుడు కెప్టెన్ లానే ఆలోచిస్తా. టీం గెలవాలని కోరుకుంటా. నాకు నేనే లీడర్’ అని వెల్లడించాడు.