Vegetarian Kohli: నేను పూర్తి వెజిటేరియన్నే.. ఆహారంలో గుడ్ల విషయంపై కోహ్లీ క్లారిటీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్‌కు చెప్పిన సమాధానం వైరల్ అయింది. ఆన్సర్ సెషన్ లో భాగంగా ఓ ప్రశ్నకు తన డైట్ గురించి చెప్పాడు కోహ్లీ. చాలా కూరగాయలు, కొన్ని గుడ్లు...

Vegetarian Kohli: నేను పూర్తి వెజిటేరియన్నే.. ఆహారంలో గుడ్ల విషయంపై కోహ్లీ క్లారిటీ

Kohli Vegeterian

Vegetarian Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్‌కు చెప్పిన సమాధానం వైరల్ అయింది. ఆన్సర్ సెషన్ లో భాగంగా ఓ ప్రశ్నకు తన డైట్ గురించి చెప్పాడు కోహ్లీ. చాలా కూరగాయలు, కొన్ని గుడ్లు, రెండు కప్పుల కాఫీ, క్వినోవా, చాలా స్పినాచ్, దోసెలు కూడా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కంట్రోల్డ్ క్వాంటిటీస్ లో మాత్రమే’ అని రెస్పాండ్ అయ్యాడు.

కోహ్లీ పూర్తిగా వెజిటేరియన్ అయిపోయాక గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో తన డైట్ మారిపోవడంలో భార్య అనుష్క శర్మ కీలకంగా వ్యవహరించిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. దీనిపై ఇండియన్ కెప్టెన్ క్లారిటీకి వచ్చి సోషల్ మీడియా అనుమానాలన్నింటికీ సమాధానం చెప్పాడు.

‘నేను వేగన్ అని ఎప్పుడూ చెప్పలేదు. పూర్తి వెజిటేరియన్ అనేదే నిజం. గట్టిగా గాలి పీల్చుకోండి. (కావాలంటే) కూరగాయలు తినేయండి’ అంటూ మంగళవారం ట్వీట్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెటర్లలో ఫిట్టెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. కఠినమైన డైట్ ఫాలో అవడం వల్లే గేమ్ లో టాప్ కు చేరానని చాలా సార్లు చెప్పాడు. అన్ని ఫార్మాట్లలోనూ పరుగులు రాబట్టగల కోహ్లీ.. బెస్ట్ బ్యాట్స్‌మన్ అనిపించుకున్నాడు.