Dinesh Karthik: బాత్రూంలోకి వెళ్లి కన్నీరు పెట్టుకున్నాను: దినేశ్ కార్తీక్

కేఎల్ రాహుల్ కు ఎదురైన పరిస్థితులే తనకూ గతంలో ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నాడు. చాలా బాధాకరమైన క్షణాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఆటగాడు ఈ విధంగా ఔటై వెనుదిరగాల్సి వస్తే అదే తన చివరి ఇన్నింగ్స్ అని అతడికి బాగా అర్థమవుతుందని అన్నాడు. ఇటువంటి పరిస్థితి తనకు ఎదురైందని, డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన తర్వాత.. అక్కడి నుంచి నిశ్శబ్దంగా బాత్రూంలోకి వెళ్లి కన్నీరు పెట్టుకున్నానని చెప్పాడు.

Dinesh Karthik: బాత్రూంలోకి వెళ్లి కన్నీరు పెట్టుకున్నాను: దినేశ్ కార్తీక్

T20 World Cup

Dinesh Karthik: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ దీనిపై భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ఇటీవల జరిగిన రెండో టెస్టులో కేఎల్ రాహుల్ ఒక్క పరుగుకే ఔటైన తీరు దురదృష్టకరమని చెప్పాడు. కేఎల్ రాహుల్ కు ఎదురైన పరిస్థితులే తనకూ గతంలో ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నాడు. చాలా బాధాకరమైన క్షణాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు.

ఆటగాడు ఈ విధంగా ఔటై వెనుదిరగాల్సి వస్తే అదే తన చివరి ఇన్నింగ్స్ అని అతడికి బాగా అర్థమవుతుందని అన్నాడు. ఇటువంటి పరిస్థితి తనకు ఎదురైందని, డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన తర్వాత.. అక్కడి నుంచి నిశ్శబ్దంగా బాత్రూంలోకి వెళ్లి కన్నీరు పెట్టుకున్నానని చెప్పాడు. ఇది చాలా బాధాకరమైన విషయమని, మనం ఏమీ చేయలేమని మనకు తెలిసిపోతుందని అన్నాడు.

మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టు మ్యాచు తుది జట్టులో కేఎల్ రాహుల్ కు స్థానం దక్కకపోవచ్చని చెప్పాడు. ఒకవేళ తుది జట్టులో స్థానం దక్కకపోతే అది కేఎల్ రాహుల్ కి అకస్మాత్తుగా ఎదురైన చెడు ఫలితం కాదని, గత ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాతి నుంచి ఇప్పటివరకు తనదైన స్థాయిలో అతడు ఆడకపోవడానికి ఫలితమని అన్నాడు.

తదుపరి మ్యాచులో అతడిని ఆడనివ్వకపోతే అది ఒక్క ఇన్నింగ్స్ ఫలితం కాదని, గత ఐదారు మ్యాచుల్లో అతడు ఆడిన తీరుకి ప్రతిఫలమని చెప్పాడు. ఈ విషయం కేఎల్ రాహుల్ కి కూడా బాగా తెలుసని అన్నాడు. కేఎల్ రాహుల్ “ఏ” క్లాస్ ఆటగాడని, అన్ని ఫార్మాట్లలోనూ రాణించగలడని అన్నాడు.

ఆటకు దూరంగా ఉంటూ అతడు కాస్త సమయాన్ని తీసుకోవాలని చెప్పాడు. ఫ్రెష్ గా తిరిగి వచ్చి వన్డేల్లో ఆడాలని చెప్పాడు. కాగా, మూడో, నాలుగో టెస్టుల్లో భారత స్క్వాడ్ లో కేఎల్ రాహుల్ పేరు ఉంది. అయితే, అతడిని తుది జట్టులో తీసుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Ind Vs Ire Womens T20 World Cup : వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన భారత్, కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం