MSD-KP: అది అబ‌ద్ధం.. నేను ధోని తొలి వికెట్ కాదు.. వీడియో సాక్ష్యం ఇదిగో.. వ‌రుస ట్వీట్లు చేస్తున్న పీట‌ర్స‌న్‌

రెండు, మూడు రోజులుగా టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని గురించి వ‌రుస‌గా ట్వీట్లు చేస్తున్నాడు ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు కెవిన్ పీట‌ర్స‌న్‌.

MSD-KP: అది అబ‌ద్ధం.. నేను ధోని తొలి వికెట్ కాదు.. వీడియో సాక్ష్యం ఇదిగో.. వ‌రుస ట్వీట్లు చేస్తున్న పీట‌ర్స‌న్‌

Dhoni celebration after wicket

Kevin Pietersen-MS Dhoni: ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు కెవిన్ పీట‌ర్స‌న్‌ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఏమైందో తెలీదు గానీ రెండు, మూడు రోజులుగా టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని గురించి వ‌రుస‌గా ట్వీట్లు చేస్తున్నాడు. ఇంత‌కీ పీట‌ర్స‌న్ బాధేంటంటే టెస్టుల్లో ధోని తీసిన మొద‌టి వికెట్ త‌న‌ది కాద‌ట‌. ఈ విష‌యాన్ని వీడియోతో స‌హా బ‌య‌ట‌పెట్టాడు.

అస‌లు ఏం జ‌రిగిందంటే..?

2017 ఐపీఎల్ సీజ‌న్ సంద‌ర్భంగా ఎంఎస్ ధోని, కెవిన్ పీట‌ర్స‌న్ ల‌ మ‌ధ్య ఓ స‌ర‌దా ఘ‌ట‌న జ‌రిగింది. ఆ స‌మ‌యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై నిషేదం ఉండ‌డంతో రైజింగ్ పుణె సూప‌ర్ జెయింట్స్ త‌రుపున ధోని ఆడాడు. ఫీల్డింగ్ చేస్తుండ‌గా.. ధోని కంటే తాను మంచి గోల్ఫ‌ర్‌ను అని పీట‌ర్స‌న్ అన్నాడు. ఇందుకు ధోని ఇలా అన్నాడు. పీట‌ర్స‌న్ వికెట్ త‌న‌కు టెస్టుల్లో మొద‌టి అని చెప్పాడు. అప్ప‌ట్లో వీరి స‌ర‌దా మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

అయితే.. తాజాగా మే 16న ఓ వీడియోను పీట‌ర్స‌న్ పోస్ట్ చేశాడు. తాను ధోని మొద‌టి వికెట్ కాదు అని చెప్ప‌డానికి సాక్ష్యం ఇదేనంటూ రాసుకొచ్చాడు. 2011లో టీమ్ఇండియా ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించింది. ఆ స‌మ‌యంలో ధోని బౌలింగ్ చేయ‌గా వికెట్ కీప‌ర్ రాహుల్ ద్ర‌విడ్ బంతిని అందుకున్నాడు. అప్పుడు పీట‌ర్స‌న్ బ్యాటింగ్ చేస్తున్నాడు. భార‌త ఆట‌గాళ్లు ఔట్ అని అప్పిల్ చేయ‌గా అంపైర్ ఔటిచ్చాడు.

వెంట‌నే పీట‌ర్స‌న్ డీఆర్ఎస్ తీసుకోగా బంతి బ్యాట్‌ను తాక‌లేద‌ని తేల‌డంతో అంపైర్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు. ఈ వీడియోనే పీట‌ర్స‌న్ పోస్ట్ చేశాడు. ‘ఇదే సాక్ష్యం. నేను ధోని తొలి వికెట్ కాదు. అయిన‌ప్ప‌టికి ధోని అద్భుత బంతిని వేశాడు .’అంటూ పీట‌ర్స‌న్ ట్వీట్ చేశాడు.

నేడు (మే 17 బుధ‌వారం) మ‌రో వీడియోను పోస్ట్ చేశాడు. నిజానికి తానే ధోని వీడియోను తీశానంటూ చెప్పాడు. ఆ వీడియోలో ధోని 92 ప‌రుగుల వ‌ద్ద ఉండగా పీట‌ర్స‌న్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడ‌గా అలిస్ట‌న్ కుక్ క్యాచ్ ప‌ట్టాడు. దీంతో ధోని ఔట్ అయ్యాడు. ఇదంతా పీట‌ర్స‌న్ స‌ర‌దా కోస‌మే చేశాడు. కాగా.. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న ధోని దీనిపై ఇంకా స్పందించ‌లేదు.