Nikhat Zareen: బాక్సింగ్ గ్లౌవ్స్ మీద మోదీ ఆటోగ్రాఫ్ తీసుకుంటా – నిఖత్ జరీన్

కామెన్వెల్త్ ఈవెంట్ లో 50కేజీల కేటగిరీలో పోటీపడిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత తాను ప్రధాని మోదీని కలుస్తానని.. బాక్సింగ్ గ్లౌవ్స్ మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటానని హర్షం వ్యక్తం చేస్తుంది. ఇండియన్ స్టార్ బాక్సర్, వరల్డ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ వరుసగా మూడో గోల్డ్ మెడల్ సాధించింది.

Nikhat Zareen: బాక్సింగ్ గ్లౌవ్స్ మీద మోదీ ఆటోగ్రాఫ్ తీసుకుంటా – నిఖత్ జరీన్

nikhat zareen (1)

 

 

Nikhat Zareen: కామెన్వెల్త్ ఈవెంట్ లో 50కేజీల కేటగిరీలో పోటీపడిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత తాను ప్రధాని మోదీని కలుస్తానని.. బాక్సింగ్ గ్లౌవ్స్ మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటానని హర్షం వ్యక్తం చేస్తుంది. ఇండియన్ స్టార్ బాక్సర్, వరల్డ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ వరుసగా మూడో గోల్డ్ మెడల్ సాధించింది.

ఆదివారం బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన మహిళల 50కేజీల లైట్ వెయిట్ కేటగిరీలో నార్తరన్ ఐర్లాండ్ కు చెందిన కార్లీ మెక్ నాల్ ను ఓడించింది. మూడు రౌండ్లలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించి.. వరల్డ్ ఛాంపియన్ స్టేటస్ నిలబెట్టుకుంది. 5-0తేడాతో గెలుపొందింది.

“ప్రధాని మోదీని కలవడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా. చివరిసారి కలిసినప్పుడు సెల్ఫీ తీసుకున్నా. టీ షర్ట్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ సారి కొత్త సెల్ఫీ దిగి బాక్సింగ్ గ్లౌవ్స్ మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటా. నా దేశానికి స్వర్ణం సాధించడం థ్రిల్లింగ్ గా ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్స్ తర్వాత ఇదే మేజర్ కాంపిటీషన్. ఇక్కడ స్వర్ణం సాధిస్తానని అంచనా వేయడం సంతోషంగా అనిపిస్తుంది” అని ఆమె వివరించారు.

Read Also: తెలంగాణ నిఖత్ జరీన్ కు పసిడి పతకం

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అద్భుతంగా ప్రారంభించాడు. కార్లీ మొదటి రౌండ్‌లో బాగా పోటీ పడినా.. నిఖత్ తన బలంతో అధిగమించింది. మొదటి రౌండ్ చివరిలో మొత్తం ఐదుగురు అనుకూలంగా ఓటు వేశారు. రెండో రౌండ్‌లోనూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మరోవైపు కార్లే వేగంగా ఊపందుకున్నప్పటికీ చివరి రౌండ్‌లోనూ నిఖత్‌ ఆధిపత్యం కొనసాగించింది. చివరి రౌండ్‌లో న్యాయనిర్ణేతలచే మరో ఏకగ్రీవ నిర్ణయంతో స్వర్ణ పతకం భారత్‌కు దక్కింది.