మందాన ట్వీట్‌కు సెక్సీ కామెంట్: బ్లాక్ చేసిన ఐసీసీ

మందాన ట్వీట్‌కు సెక్సీ కామెంట్: బ్లాక్ చేసిన ఐసీసీ

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మ్యాచ్‌కు సంబంధించే కాకుండా ఆటగాళ్లపై పర్సనల్‌గా కూడా రియాక్ట్ అవుతుంది. బర్త్ డేలు, స్పెషల్ సెంచరీలు చేసిన రోజులతో పాటు ప్రత్యేక రికార్డులను ప్రస్తావిస్తూ అభినందనలు తెలుపుతోంది. ఐసీసీ గురువారం భారత బ్యాట్స్ ఉమెన్ మంధాన ట్వీట్‌ను ఇలా  పోస్టు చేసింది. తనను తాను క్రికెటర్‌గా మాత్రమే చూసుకుంటానంటూ ఉమెన్ క్రికెటర్‌గా కాదని తెలిపింది. కాబట్టి తన గురించి ఇలాంటి ప్రత్యేకమైన పేర్లను పెట్టొద్దని సూచించినట్లు అందులో ఉంది.  

22ఏళ్ల మంధానను ప్రశంసిస్తూ ఆ ట్వీట్‌ను పోస్టు చేసింది. ఇటీవల ముగిసిన మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్‌కు ప్రాతినిధ్యం వహించి 67 బంతుల్లో 90పరుగులు చేసి సూపర్‌నోవాస్‌పై విజయం సాధించేందుకు దోహదమైంది. ఆ ట్వీట్‌కు పాకిస్తాన్ అభిమాని ఒకరు భారతీయులను పిస్ డ్రింకర్స్ అంటూ సంబోధించాడు. అంతటితో ఆగకుండా మహిళా క్రికెటర్లు అందంగా ఉండరు అంటూ వాళ్లను చూస్తే ఏ మాత్రం వినోదం రాదని అందుకే మహిళా క్రికెట్ చూడమని ట్వీట్ చేశాడు. 

దానికి స్పందించిన ఐసీసీ ట్విట్టర్ ద్వారా..’బాబూ ఇది 2019. నువ్వు ఇంకా ఎదగాలి. బై.. అంటూ బ్లాక్ చేసినట్లు హ్యాష్ ట్యాగ్‌ను జత చేస్తూ పోస్టు చేసింది. మహిళా క్రికెటర్లకు మద్దతుగా నిలిచినందుకు ఐసీసీని ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.