ICC Fined Team India: న్యూజిలాండ్‌తో తొలివన్డేలో టీమిండియాకు జరిమానా విధించిన ఐసీసీ.. ఎందుకంటే?

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు విజయం సాధించిన విషయం విధితమే. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా అతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమిండియాకు జరిమానా విధించింది.

ICC Fined Team India: న్యూజిలాండ్‌తో తొలివన్డేలో టీమిండియాకు జరిమానా విధించిన ఐసీసీ.. ఎందుకంటే?

ICC Fine

ICC Fined Team India: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈనెల 18న తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. శుభ్‌మన్ గిల్ అద్భుత ఆటతీరుతో డబుల్ సెంచరీ (208 పరుగులు) చేశాడు. దీంతో టీమిండియా స్కోర్ 349కి చేరింది.

India vs New Zealand 1st ODI: తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం.. ఫొటో గ్యాలరీ

350 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు తొలుత వికెట్లు చేజార్చుకున్నా.. చివరిలో ఆ జట్టు బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో 140 పరుగులు చేశాడు. చివరకు 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ తప్పుచేసింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఐసీసీ జరిమానా విధించింది. ఈ తప్పును ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు.

 

నిర్ణీత సమయంలోపు భారత జట్టు మూడు ఓవర్లు ఆలస్యంగా వేసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం.. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ ఫీజులో 60శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంపై ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ మాట్లాడుతూ.. టీమిండియా మూడు ఓవర్లను నిర్ణిత సమయానికి తగ్గించిందని అన్నారు.