T20 World Cup : టీ20 ప్రపంచకప్ 2022 ఫుల్ షెడ్యూల్ ఇదే.. టీమిండియా మ్యాచ్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ICC ప్రకటించింది. ఆస్ట్రేలియా (Cricket Australia) వేదికగా 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మెగా టోర్నమెంట్ జరగనుంది.

T20 World Cup : టీ20 ప్రపంచకప్ 2022 ఫుల్ షెడ్యూల్ ఇదే.. టీమిండియా మ్యాచ్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

Icc Men's T20 World Cup 2022 Full Schedule T20 World Cup 2022 Full Schedule, Match Timings In Ist, Time Table, Venues And Dates

ICC Men’s T20 World Cup 2022 Full Schedule : టీ20 ప్రపంచకప్(T20 World Cup 2022) షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఆస్ట్రేలియా (Cricket Australia) వేదికగా 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మెగా టోర్నమెంట్ జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్ జరగనుంది. నవంబర్ 10న రెండో సెమీఫైనల్, నవంబర్ 13న ఫైనల్ జరుగనుంది.

అలాగే.. Super 12: Group 1 స్టేజీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 23న టీమిండియా దాయాది జట్టు పాకిస్థాన్‌తో తొలి పోరులో తలబడనుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 28న మ్యాచ్ జరగనుంది.

ప్రపంచకప్‌కి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకూ మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. 16 జట్లతో బరిలోకి దిగనున్న ఈ టోర్నీ‌లో భారత్ జట్టు గ్రూప్-2లో తలపడనుంది. భారత జట్టుతో పాటు ఈ గ్రూప్‌లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. మరో రెండు జట్లు ఫస్ట్ రౌండ్‌లో ఆడాల్సి ఉంది. తద్వారా సూపర్-12కి అర్హత సాధించి ఈ గ్రూప్‌లోకి రానున్నాయి. ఈ రెండింటిలో వెస్టిండీస్ లేదా శ్రీలంక జట్లలో ఒకటి మాత్రమే బరిలో నిలువనుంది.

ఐసీసీ T20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఆరు సార్లు తలపడ్డాయి. టీమిండియా ఐదు మ్యాచ్‌ల్లో.. పాకిస్థాన్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టును 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఓడించింది. వరల్డ్‌కప్ చరిత్రలోనే పాక్ ఫస్ట్ టైం టీమిండియాపై గెలిచింది. 2022 ఏడాదిలో టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియాపై మరోసారి గెలిచేందుకు పాక్ ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొవాల్సిందే.. టీ20 వరల్డ్‌కప్ 2021లో ఫస్ట్ మ్యాచ్‌లోనే పాక్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. అప్పుడు టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిబాటపట్టింది. టీమిండియా.. పాక్‌ను దెబ్బకు దెబ్బ తీసి ఇంటిదారి పట్టేస్తే గానీ.. టోర్నీలో సెమీస్ వరకూ భారత్‌కు తిరుగు ఉండదనే చెప్పాలి.

T20 World Cup 2022 – Round 1 qualifiers :

Oct. 16 – Sri Lanka vs Namibia – 9:30 am – Kardinia Park, Geelong
Oct. 16 – Qualifier2 vs Qualifier3 – 1:30 pm – Kardinia Park, Geelong
Oct. 17 – West Indies vs Scotland – 9:30 am – Bellerive Oval, Hobart
Oct. 17 – Qualifier1 vs Qualifier4 – 1:30 pm – Bellerive Oval, Hobart
Oct. 18 – Namibia vs Qualifier3 – 9:30 am – Kardinia Park, Geelong
Oct. 18 – Sri Lanka vs Qualifier2 – 1:30 pm – Kardinia Park, Geelong
Oct. 19 – Scotland vs Qualifier4 – 9:30 am – Bellerive Oval, Hobart
Oct. 19 – West Indies vs Qualifier1 -1:30 pm – Bellerive Oval, Hobart
Oct. 20 – Sri Lanka vs Qualifier3 – 9:30 am – Kardinia Park, Geelong
Oct. 20 – Namibia vs Qualifier2 – 1:30 pm – Kardinia Park, Geelong
Oct. 21 – West Indies vs Qualifier4 – 9:30 am – Bellerive Oval, Hobart
Oct. 21 – Scotland vs Qualifier1 – 1:30 pm – Bellerive Oval, Hobart

T20 World Cup 2022 – Super 12: Group 1 fixtures

Oct. 22 – Australia vs New Zealand – 12:30 pm – SCG, Sydney
Oct. 22 – England vs Afghanistan – 4:30 pm – Perth Stadium
Oct. 23 – A1 vs B2 – 9:30 am – Bellerive Oval, Hobart
Oct. 25 – Australia vs A1 – 4:30 pm – Perth Stadium
Oct. 26 – England vs B2 – 9:30 am – MCG, Melbourne
Oct. 26 – New Zealand vs Afghanistan – 1:30 pm – MCG, Melbourne
Oct. 28 – Afghanistan vs B2 – 9:30 am – MCG, Melbourne
Oct. 28 – England vs Australia – 1:30 pm – MCG, Melbourne
Oct. 29 – New Zealand vs A1 – 1:30 pm – SCG, Sydney
Oct. 31 – Australia vs B2 – 1:30 pm – The Gabba, Brisbane
Nov. 1 – Afghanistan vs A1 – 9:30 am – The Gabba, Brisbane
Nov. 1 – England vs New Zealand- 1:30 pm – The Gabba, Brisbane
Nov. 4 – New Zealand vs B2 – 9:30 am – Adelaide Oval, Adelaide
Nov. 4 – Australia vs Afghanistan – 1:30 pm – Adelaide Oval, Adelaide
Nov. 5 – England vs A1 – 1:30 pm – SCG, Sydney

T20 World Cup 2022 – Super 12: Group 2 fixtures

Oct. 23 – India vs Pakistan – 1:30 pm – MCG, Melbourne
Oct. 24 – Bangladesh vs A2 – 9:30 am – Bellerive Oval, Hobart
Oct. 24 – South Africa vs B1 – 1:30 pm – Bellerive Oval, Hobart
Oct. 27 – South Africa vs Bangladesh – 8:30 am – SCG, Sydney
Oct. 27 – India vs A2 – 12:30 pm – SCG, Sydney
Oct. 27 – Pakistan vs B1 – 4:30 pm – Perth Stadium, Perth
Oct. 30 – Bangladesh vs B1 – 8:30 am – The Gabba, Brisbane
Oct. 30 – Pakistan vs A2 – 12:30 pm – Perth Stadium, Perth
Oct. 30 – India vs South Africa – 4:30 pm – Perth Stadium, Perth
Nov. 2 – B1 vs A2 – 9:30 am – Adelaide Oval, Adelaide
Nov. 2 – India vs Bangladesh – 1:30 pm – Adelaide Oval, Adelaide
Nov. 3 – Pakistan vs South Africa – 1:30 pm – SCG, Sydney
Nov. 6 – South Africa vs A2 – 5:30 am – Adelaide Oval, Adelaide
Nov. 6 – Pakistan vs Bangladesh – 9:30 am – Adelaide Oval, Adelaide
Nov. 6 – India vs B1 – 1:30 pm – MCG, Melbourne

T20 World Cup 2022 – Knockouts and Final

Nov 9 – Semifinal 1 – 1:30 pm – SCG, Sydney
Nov 10 – Semifinal 2 – 1:30 pm – Adelaide Oval, Adelaide
Nov 13 – Final – 1:30 pm – MCG, Melbourne

Read Also : Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ