ICC ODI rankings: అగ్రస్థానాన్ని కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ నం.1కు చేరుకునే ఛాన్స్

టీమిండియాతో శనివారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. దీంతో మొదటి స్థానంలోకి ఇంగ్లండ్ ఎగబాకింది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఈ మూడు జట్లకు 113 రేటింగ్ పాయింట్లే ఉన్నాయి.

ICC ODI rankings: అగ్రస్థానాన్ని కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ నం.1కు చేరుకునే ఛాన్స్

Team India

ICC ODI rankings: టీమిండియాతో శనివారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. దీంతో మొదటి స్థానంలోకి ఇంగ్లండ్ ఎగబాకింది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఈ మూడు జట్లకు 113 రేటింగ్ పాయింట్లే ఉన్నాయి.

మంగళవారం జరిగే మూడో వన్డేలో న్యూజిలాండ్ పై టీమిండియా గెలిస్తే వన్డేల్లో నంబర్ 1 స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియంలో మూడో వన్డే జరగాల్సి ఉంది. రెండో వన్డే జరగకముందు న్యూజిలాండ్ 115 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

అలాగే, ఇంగ్లండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా 112 పాయింట్లతో మూడో స్థానంలో, టీమిండియా 112 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగింది. ఇప్పుడు ఆస్ట్రేలియా అదే 112 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 106 పాయింట్లతో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటికే టీమిండియా టీ20లో అగ్రస్థానంలో ఉంది. టెస్టు ఫార్మాట్ లోనూ అగ్రస్థానానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. టెస్టుల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో, టీమిండియా రెండో స్థానంలో ఉన్నాయి.

Singer Mangli Reaction : రాళ్ల దాడిపై స్పందించిన సింగర్ మంగ్లీ.. అసలేం జరిగిందో చెప్పిన సింగర్