ICC Player of the Month: ఐసీసీ స్పెషల్ అవార్డు, బెస్ట్ ఫీల్డర్‌గా నిలిచిన కుక్క

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ బౌలర్‌కో.. బ్యాట్స్‌మన్‌కో అవార్డు ఇవ్వలేదు.

ICC Player of the Month: ఐసీసీ స్పెషల్ అవార్డు, బెస్ట్ ఫీల్డర్‌గా నిలిచిన కుక్క

Icc Player Of The Month

ICC Player of the Month: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ బౌలర్‌కో.. బ్యాట్స్‌మన్‌కో అవార్డు ఇవ్వలేదు. ఫీల్డర్లను ముప్పు తిప్పలు పెట్టిన కుక్కకు ఆ అవార్డు దక్కింది. ఈ అవార్డుపై ట్విటర్‌లో స్పందించింది.

‘ఈసారి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుల్లో ఒక కొత్త గెస్ట్ వచ్చి చేరింది. బంతిని నోట కరచుకొని మైదానంలో ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క.. దాన్ని అథ్లెట్‌ డాగ్‌ పరిగణిస్తూ.. ‘ఐసీసీ డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుతో సత్కరించాం’ అంటూ పోస్ట్‌ పెట్టింది.

సెప్టెంబర్ మొదటి వారం ఐర్లాండ్‌ క్లబ్‌ క్రికెట్‌లో భాగంగా మైదానంలో కుక్క అల్లరి పనిచేసింది. బ్రీడీ, సీఎస్‌ఎన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ జరుగుతుండగా అబ్బీ లెక్కీ స్కేర్‌లెగ్‌ దిశగా షాట్‌ ఆడారు. ఫీల్డర్‌ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు విసిరారు. బంతిని అందుకున్న బౌలర్‌ వికెట్లను గిరాటేసే ప్రయత్నం చేయగా.. మిస్‌ అయింది. అలా రనౌట్‌ అవకాశం కూడా పోయింది.

 

Read Also: క్రికెటర్లకు మరణ భయం పుట్టుకొచ్చింది – గంగూలీ

అదే సమయంలో యజమాని నుంచి తప్పించుకొని మైదానంలోకి పరుగులు తీసింది. బుజ్జి కుక్క బంతిని నోట కరుచుకొని గ్రౌండ్‌లో పరుగులు పెట్టింది. అలా ఫీల్డర్లు కూడా పరుగులు తీసి కుక్కను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.