ICC టాప్ 5 బ్యాట్స్‌మన్‌లో ముగ్గురు భారతీయులే

ICC టాప్ 5 బ్యాట్స్‌మన్‌లో ముగ్గురు భారతీయులే

భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన పూర్తి చేసుకున్న టీమిండియా ప్లేయర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ 5లో స్థానాలను దక్కించుకున్నారు. కింగ్ కోహ్లీ టాప్ పొజిషన్‌కు 4పాయింట్ల దూరంలో నిలిచాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్‌కు కోహ్లీకి 3పరుగుల వ్యత్యాసమే ఉంది. 

ఇటీవల డై అండ్ నైట్ టెస్టు అనంతరం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకుల అనంతరం విడుదలైన ర్యాంకులను బట్టి అజింకా రహానె(759)పాయింట్లతో టాప్ 5స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇలా తొలి 5స్థానాల్లో భారత ప్లేయర్లు నిలవగా రహానె కంటే ముందు స్థానంలో పూజారా(791)పాయింట్లతో నిలిచాడు. 

యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని టాప్ 10కు చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాంత్ 17, ఉమేశ్ 21వ స్థానాల్లో నిలవగా అశ్విన్ 10, మొహ్మద్ షమీ 11వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పేసర్ బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు. జడేజా ఆల్‌రౌండర్ జాబితాలో రెండవ, అశ్విన్ ఐదవ స్థానాలను పదిలం చేసుకున్నారు.

నెం.1 స్టీవ్ స్మిత్, రెండో ర్యాంకు విరాట్ కోహ్లీ తర్వాత జాబితాలో టాప్ 3స్థానాన్ని కేన్ విలియమ్సన్ దక్కించుకున్నాడు. పాయింట్ల ఆధారంగా ఐసీసీ కేటాయించిన ర్యాంకు వివరాలిలా ఉన్నాయి.