ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లు.. రోహిత్ వెనుక కోహ్లీ

రీసెంట్ గా ఐసీసీ రిలీజ్ చేసిన ఎమ్మారెఫ్ వరల్డ్ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ ర్యాంక్ దిగజారింది. ఐదో స్థానంలో 797 రేటింగ్ తో రోహిత్ శర్మ ఉండగా.. అతనికి రెండు స్థానాల 756..

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లు.. రోహిత్ వెనుక కోహ్లీ

Icc Rankings

ICC Test Rankings: రీసెంట్ గా ఐసీసీ రిలీజ్ చేసిన ఎమ్మారెఫ్ వరల్డ్ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ ర్యాంక్ దిగజారింది. ఐదో స్థానంలో 797 రేటింగ్ తో రోహిత్ శర్మ ఉండగా.. అతనికి రెండు స్థానాల 756 రేటింగ్ తో విరాట్ కోహ్లీ ఏడో స్థానానికి చేరాడు. ఈ ఏడాది ఆరంభంలో మూడు ఫార్మాట్లలోనూ ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ.. సంవత్సరం ముగిసే నాటికి కోల్పోయాడు.

ఇదిలా ఉంటే మార్నస్ ల్యాబుషనె తొలిసారి ఐసీసీ టాప్ 1 ర్యాంక్ దక్కించుకున్నాడు. యాషెస్ సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఆడి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 912 పాయింట్లతో టాప్ స్థానంలో ఉండగా రెండో స్థానంలో జో రూట్ 897రేటింగ్‌తో ఉన్నాడు. టాప్ 3 స్థానంలో స్టీవ్ స్మిత్ 884 రేటింగ్‌తో ఉండగా తర్వాతి స్థానాల్లో కేన్ విలియమ్సన్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, దిముత్ కరుణరత్నె, బాబర్ అజామ్, ట్రావీస్ హెడ్ ఉన్నారు.

rEAD aLSO : వ్యాయామ సమయంలో గుండెపోటులకు కారణం?

ఆల్‌రౌండర్‌గా టాప్ 2లో అశ్విన్
టెస్టు ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ 2స్థానం దక్కించుకున్నాడు. అశ్విన్ కు 360 రేటింగ్ దక్కగా జాసన్ హోల్డర్ 382రేటింగ్ తో టాప్ లో ఉన్నాడు. టాప్ 3కూడా ఇండియన్ ప్లేయరే కావడం గమనార్హం. రవీంద్ర జడేజా 346పాయింట్లతో టాప్ 3ప్లేసులో ఉండగా.. షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, జామీసన్, పాట్ కమిన్స్, క్రిస్ వోక్స్, జో రూట్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

బౌలర్ గానూ అశ్విన్ టాప్ 2లోనే
పాట్ కమిన్స్ 904పాయింట్లతో ఉండగా టాప్ 2పొజిషన్ లో రవిచంద్రన్ అశ్విన్ 883పాయింట్లతో ఉన్నాడు. ఆ తర్వాత జాబితాలో షహీన్ అఫ్రీది, టిమ్ సౌథీ, జోష్ హాజిల్ వుడ్, కగిసో రబాడ, నీల్ వాగ్నర్, జేమ్స్ అండర్సన్, మిచెల్ స్టార్క్, కైలీ జామీసన్ ఉన్నారు.

rEAD aLSO: ఇంట్రెస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా ‘సార్’!

ఇదిలా ఉంటే టెస్టు ర్యాంకింగ్స్ లో 3వేల 465పాయింట్లతో 124 రేటింగ్ దక్కించుకుని టీమిండియా టాప్ 1కు చేరింది. ప్రస్తుత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.