ICC Test Rankings: ఆల్ రౌండర్లలో జడేజా నెం.2.. టాప్ 10 బ్యాటింగ్‌లో ముగ్గురు మనోళ్లే..

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సెకండ్ ర్యాంకులోకి దూసుకెళ్లాడు. 386 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు.

ICC Test Rankings: ఆల్ రౌండర్లలో జడేజా నెం.2.. టాప్ 10 బ్యాటింగ్‌లో ముగ్గురు మనోళ్లే..

Icc Test Rankings

ICC Test Rankings- Ravindra Jadeja : ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సెకండ్ ర్యాంకులోకి దూసుకెళ్లాడు. 386 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ (385 పాయింట్లు)ను జడేజా వెనక్కి నెట్టేశాడు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ జేసన్‌ హోల్డర్‌ 423 పాయింట్లతో టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

హోల్డర్ తర్వాతి స్థానంలో జడేజా చోటు దక్కించుకున్నాడు. ఆశ్విన్‌ నాలుగో స్థానంలో ఉండగా.. హోల్డర్ కంటే జడేజా 37 పాయింట్ల తేడాతో వెనుకబడి ఉన్నాడు. రేటింగ్ పాయింట్లలో స్టోక్స్ కంటే ఒక రేటింగ్ పాయింట్ ఎక్కువగా సాధించాడు. బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఐదో ర్యాంకులో నిలిచాడు. టాప్ 10 ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది.

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 సందర్భంగా స్టోక్స్ గాయపడ్డాడు. ఈ ఏడాది ఆరంభంలో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 3 వ టెస్టులో రవీంద్ర జడేజా చేతికి గాయమై టెస్ట్ క్రికెట్ ఆడలేదు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన 4-టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు.

చివరి 3 టెస్టుల్లో అక్సర్ పటేల్ చోటు దక్కించుకున్నాడు. ఆల్ రౌండర్ల చార్టుల్లో అశ్విన్ 4వ స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ బ్యాట్స్ మాన్ హెన్రీ నికోల్స్‌ను 7వ స్థానానికి నెట్టేశాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెనుక ఒక ర్యాంకుతో కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనుక రెండో స్థానంలో నిలిచాడు. తద్వారా ఐసిసి టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానాన్ని నిలుపుకున్నాడు.

ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్  :

1. కేన్ విలియమ్సన్
2. స్టీవ్ స్మిత్
3. మార్నస్
4. జో రూట్
5. విరాట్ కోహ్లీ
6. రిషబ్ పంత్
7. రోహిత్ శర్మ
8. హెన్రీ నికోల్స్
9. డేవిడ్ వార్నర్
10. బాబర్ అజామ్