ICC Test Rankings: వరల్ట్ ఛాంపియన్‌షిప్ ముందు విరాట్‌కు గుడ్ న్యూస్

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మరో రెండ్రోజుల్లో మొదలుకానుంది. అంతకంటే ముందే విరాట్ కు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి చేరుకోగలిగాడనే గుడ్ న్యూస్ వచ్చింది. ఇక నెం.1 స్థానాన్ని స్టీవ్ స్మిత్ పథిలంగా ఉంచుకున్నాడు.

ICC Test Rankings: వరల్ట్ ఛాంపియన్‌షిప్ ముందు విరాట్‌కు గుడ్ న్యూస్

Icc Test Rankings Steve Smith No 1 Virat Kohli At No 4

ICC Test Rankings: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మరో రెండ్రోజుల్లో మొదలుకానుంది. అంతకంటే ముందే విరాట్ కు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి చేరుకోగలిగాడనే గుడ్ న్యూస్ వచ్చింది. ఇక నెం.1 స్థానాన్ని స్టీవ్ స్మిత్ పథిలంగా ఉంచుకున్నాడు. గతేడాది జరిగిన బాక్సింగ్ డే టెస్టు తర్వాత తొలి సారి టెస్టు ర్యాంకింగులను రిలీజ్ చేసింది ఐసీసీ.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు రావాల్సిన నెం.1 ర్యాంకును స్మిత్ కొట్టేశాడు. ఇంగ్లాండ్ తో ఎడ్జ్‌బాస్టన్ వేదిగా జరిగిన రెండో టెస్టును గాయం కారణంగా మిస్ చేసుకున్నాడు విలియమ్సన్. తొలి టెస్టులో కేవలం 13పరుగులు మాత్రమే చేయగలిగాడు. దాంతో ఐదు పాయింట్లు కోల్పోయాడు. స్మిత్ 891రేటింగ్ పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా విలియమ్సన్ రెండో స్థానానికి పడిపోయాడు.

స్మిత్ అంతర్జాతీయంగా 167 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. అతని కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన జాబితాలో గ్యారీ సోబర్స్ (189 మ్యాచ్ లు), వివ్ రిచర్డ్స్ (179 మ్యాచ్ లు) మాత్రమే ముందు వరుసలో ఉన్నారు.