ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ : అదరగొట్టిన టీమిండియా ప్లేయర్స్

ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ : అదరగొట్టిన టీమిండియా ప్లేయర్స్

ICC : ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్స్ అదరగొట్టారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన స్పిన్ మాయతో ప్రత్యర్థిని కట్టడి చేస్తున్న అశ్విన్‌ టాప్ త్రీలోకి దూసుకొచ్చాడు. ఏకంగా నాలుగు ప్లేస్‌లు పైకి ఎగబాకి.. 823 పాయింట్లతో మూడో ప్లేస్ దక్కించుకున్నాడు. గాయం నుంచి కోలుకుని జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా ఒక ప్లేస్ పడిపోయి.. 746 రేటింగ్ పాయింట్లతో 9వ ప్లేస్‌లో నిలిచాడు. ఈ లిస్ట్ లో పాట్ కమ్మిన్స్, నీల్ వాగ్నర్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

ఇటు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ యథావిధిగా 836 పాయింట్లతో ఐదో ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్‌లో తొలిసారి బెస్ట్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఏకంగా ఆరు స్థానాలు పైకి ఎగబాకి 742 పాయింట్లతో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచాడు. నయా వాల్ పుజారా రెండు స్థానాలు దిగజారి 708 పాయింట్లతో 10 ప్లేస్‌కు పడిపోయాడు.