India Women U19: మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. భారత టార్గెట్ 69

ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది.

India Women U19: మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. భారత టార్గెట్ 69

India Women U19: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

లక్ష్యం తక్కువగా ఉండటంతో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఐసీసీ నిర్వహిస్తున్న అండర్-19 మహిళల టీ20 మొదటి ప్రపంచ కప్‌ గెలుచుకున్న దేశంగా టీమిండియా నిలవబోతుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. 17.1 ఓవర్లలో, 68 పరుగులు మాత్రమే ఇచ్చి ఆలౌట్ చేశారు. ఆ జట్టులో అత్యధిక స్కోరు 19. ఓపెనర్, కెప్టెన్ అయిన గ్రేస్ స్రివెన్స్ 4 పరుగులకు ఔట్ కాగా, మరో ఓపెనర్ లిబర్టీ హీప్ డకౌట్ అయింది.

Police Recruitment: తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 7 మార్కులు కలిపేందుకు బోర్డు అంగీకారం

తర్వాత వచ్చిన నియామ్ ఫియోనా 8 బంతుల్లో 10 పరుగులు, సెరెన్ స్మేల్ 3 పరుగులు, ర్యానా మ్యాక్ డొనాల్డ్ గే 19 పరుగులు, చారిస్ 2 పరుగులు, అలెక్సా స్టోన్ హౌజ్ 11 పరుగులు, జోసీ గ్రోవ్స్ 4 పరుగులు, హన్నా బేకర్ డకౌట్, సోఫియా స్మేల్ 11 పరుగులు చేసి ఔట్ కాగా, ఎల్లీ అండర్సన్ డకౌట్‌గా వెను దిరిగింది. దీంతో ఇంగ్లండ్ 68 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో ఇండియా తరఫున ఆరుగురు బౌలింగ్ చేయగా అందరూ వికెట్లు తీసుకోవడం విశేషం. తిటాస్ సాధు 2 వికెట్లు, అర్చనా దేవి 2 వికెట్లు, పర్షవి చోప్రా 2 వికెట్లు తీయగా, మన్నత్ కశ్యప్, షఫాలి వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు.