ICC Women’s T20 World Cup LIve Updates: Ind Vs Aus.. భారత్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.

ICC Women’s T20 World Cup LIve Updates: Ind Vs Aus.. భారత్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

ICC Women's T20 World Cup

ICC Women’s T20 World Cup LIve Updates: ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ లో భారత్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీ నుంచి భారత్ ఔట్ అయ్యింది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో మ్యాచ్ జరిగింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా, గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్-ఇండియా సెమీఫైనల్ కు వెళ్లాయి.

గ్రూప్-ఏలో తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, గ్రూప్-బీలో రెండో స్థానంలో ఉన్న ఇండియా నేడు తొలి సెమీఫైనల్ ఆడాయి. అలాగే, గ్రూప్-బిలో తొలి స్థానంలో ఉన్న ఇంగ్లండ్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా శుక్రవారం రెండో సెమీఫైనల్ లో ఆడతాయి.

2009లో తొలి ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ జరిగింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఐదుసార్లు, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి గెలుపొందాయి. ఈసారి గెలిచి తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని భారత అమ్మాయిలు కలలు కన్నారు. అయితే, మరోసారి టీమిండియా విఫలమైంది. కల.. కలగానే మిగిలిపోయింది.

ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ విజేతలు

2009లో తొలి ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ జరిగింది
తొలి ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్
2010, 2012, 2014 విజేత ఆస్ట్రేలియా
2016 ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్
2018, 2020 విజేత ఆస్ట్రేలియా
ఇప్పటివరకు ఐదుసార్లు కప్ గెలిచిన ఆస్ట్రేలియా
ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి గెలుపు
ప్రస్తుత ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 26న

Umesh Yadav Cheated : భారత క్రికెటర్‌ను దారుణంగా మోసం చేసిన స్నేహితుడు.. రూ.44 లక్షలకు టోకరా

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 23 Feb 2023 09:43 PM (IST)

    భారత్ ఓటమి.. ఫైనల్ కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

    ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్-2023లో భారత జట్టు ప్రస్థానం ముగిసింది. తొలి సెమీఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పోరాడి ఓడిపోయింది. టీమిండియాలో హర్మన్ ప్రీత్ కౌర్ 51, రోడ్రిగ్స్ 43 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో టీమిండియా 20 ఓవర్లకు ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. రేపు రెండో సెమీఫైనల్ జరగనుంది. గ్రూప్-బీలో తొలి స్థానంలో ఉన్న ఇంగ్లండ్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా రేపు రెండో సెమీఫైనల్ లో ఆడతాయి. గెలిచిన జట్టు ఈ నెల 26న ఆస్ట్రేలియాతో ఫైనల్ లో ఆడనుంది.

  • 23 Feb 2023 09:37 PM (IST)

    చివరి ఓవర్.. ఇంకా 16 పరుగులు..

    మరో ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. టీమిండియా స్కోరు 157/7(19 ఓవర్లకు)గా ఉంది. స్నేహ్ రానా 11 పరుగులకు ఔట్ అయింది. విజయం సాధించాలంటే ఒక్క ఓవర్లో 16 పరుగులు చేయాలి.

  • 23 Feb 2023 09:32 PM (IST)

    ఉత్కంఠను పెంచిన చివరి 2 ఓవర్లు

    చివరి 2 ఓవర్లు ఉత్కంఠను పెంచుతున్నాయి. టీమిండియా స్కోరు 153/6 (18 ఓవర్లకు)గా ఉంది. విజయం దక్కాలంటే టీమిండియా మరో 20 పరుగులు చేయాలి.

  • 23 Feb 2023 09:25 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా

    టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఔటైన కాసేపటికే రిచా ఘోష్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయింది. టీమిండియా స్కోరు 135/6 (16 ఓవర్లకు)గా ఉంది.

  • 23 Feb 2023 09:18 PM (IST)

    హాఫ్ సెంచరీ బాది ఔటైన హర్మన్ ప్రీత్ కౌర్

    భారత స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ బాదింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చి నిలదొక్కుకుని అద్భుతంగా ఆడింది. 14.2 ఓవర్ల వద్ద 32 బంతుల్లో 1 సిక్సు, 6 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ చేసింది. అనంతరం ఔట్ అయింది. టీమిండియా స్కోరు 133/5గా ఉంది.

  • 23 Feb 2023 08:58 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

    టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన రోడ్రిగ్స్ 43 పరుగులకు బ్రౌన్ బౌలింగ్ లో ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్ (33), రిచా ఘోష్ (0) ఉన్నారు.

  • 23 Feb 2023 08:54 PM (IST)

    టీమిండియా స్కోరు 10 ఓవర్లకు 93/3

    టీమిండియాకు టాప్ ఆర్డర్ కుప్పకూలినప్పటికీ అనంతరం వచ్చిన రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడుతున్నారు. రోడ్రిగ్స్ 39, హర్మన్ ప్రీత్ కౌర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 93/3 (10 ఓవర్లకు)గా ఉంది.

  • 23 Feb 2023 08:33 PM (IST)

    కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్

    టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. షఫాలీ వర్మ 9, స్మృతి మంధాన 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయిన కాసేపటికే యస్తికా భాటియా కూడా 4 పరుగులకే ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో జెమీమా రోడ్రిగ్స్ 14, హర్మన్ ప్రీత్ కౌర్ 6 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 40 దాటింది.

  • 23 Feb 2023 08:19 PM (IST)

    ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన ఔట్

    టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన ఔట్ అయ్యారు. షఫాలీ వర్మ 9, స్మృతి మంధాన 2 పరుగులు మాత్రమే చేయగలిగారు. ప్రస్తుతం క్రీజులో యస్తికా భాటియా, జెమీమా ఉన్నారు.
    టీమిండియా స్కోరు 20 దాటింది.

  • 23 Feb 2023 08:11 PM (IST)

    క్రీజులోకి షఫాలీ వర్మ, స్మృతి మంధాన

    టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి షఫాలీ వర్మ, స్మృతి మంధాన వచ్చారు.

  • 23 Feb 2023 07:58 PM (IST)

    టీమిండియా లక్ష్యం 173

    ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లకు ఆస్ట్రేలియా 4 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో అలిస్సా హీలీ 25, బెత్ మూనీ 54, మెగ్ లన్నింగ్ 49 (నాటౌట్), గార్డ్ నెర్ 31, గ్రేస్ హ్యారీస్ 7, పెర్రీ 2 (నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా లక్ష్యం 173. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2 వికెట్లు తీయగా, రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు.

  • 23 Feb 2023 07:49 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 150 దిశగా స్కోరు

    ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో గార్డ్ నెర్ 31 పరుగులకు ఔట్ అయింది. స్కోరు 142/3 (18 ఓవర్లకు)గా ఉంది.

  • 23 Feb 2023 07:36 PM (IST)

    100 దాటిన ఆస్ట్రేలియా స్కోరు

    ఆస్ట్రేలియా స్కోరు 100 దాటింది. ప్రస్తుతం క్రీజులో మెగ్ లన్నింగ్ 23, గార్డ్ నెర్ 8 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 15 ఓవర్ల నాటికి 113/2 గా ఉంది.

  • 23 Feb 2023 07:31 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

    ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. శిఖా పాండే బౌలింగ్ లో 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెత్ మూనీ ఔట్ అయింది.

  • 23 Feb 2023 07:23 PM (IST)

    ఓపెనర్ బెత్ మూనీ హాఫ్ సెంచరీ

    ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ హాఫ్ సెంచరీ బాదింది. ఒక సిక్స్, ఏడు ఫోర్ల సాయంతో 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది.

  • 23 Feb 2023 07:17 PM (IST)

    ఆస్ట్రేలియా జట్టు స్కోరు 10 ఓవర్ల నాటికి 69/1

    ఆస్ట్రేలియా జట్టు స్కోరు 10 ఓవర్ల నాటికి 69/1గా ఉంది. బెత్ మూనీ 38, మెగ్ లన్నింగ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 23 Feb 2023 07:07 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. 50 దాటిన స్కోరు

    ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అలిస్సా హీలీ 25 బంతుల్లో 25 పరుగులు చేసి రాధా యాదవ్ బౌలింగ్ లో ఔట్ అయింది. ఆసీస్ స్కోరు 50 దాటింది. 8 ఓవర్లనాటికి ఆసీస్ స్కోరు 54గా ఉంది. క్రీజులో బెత్ మూనీ 26, మెగ్ లన్నింగ్ 1 పరుగుతో ఉన్నారు.

  • 23 Feb 2023 06:42 PM (IST)

    ఆస్ట్రేలియా జట్టు స్కోరు 3 ఓవర్లనాటికి 21

    ఆస్ట్రేలియా జట్టు స్కోరు 3 ఓవర్లనాటికి 21గా ఉంది. అలిస్సా హీలీ 14, బెత్ మూనీ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 23 Feb 2023 06:32 PM (IST)

    ఓపెనర్లుగా అలిస్సా హీలీ, బెత్ మూనీ

    ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా అలిస్సా హీలీ, బెత్ మూనీ వచ్చారు.

  • 23 Feb 2023 06:27 PM (IST)

    గౌతమ్ గంభీర్ సందేశం

    టీమిండియాకు గౌతమ్ గంభీర్ సందేశం

  • 23 Feb 2023 06:18 PM (IST)

    ఆస్ట్రేలియా జట్టు..

    ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే..

  • 23 Feb 2023 06:14 PM (IST)

    భారత జట్టు ఇదే..

    హర్మన్ ప్రీత్ సేన..