IND Vs South Africa : భారత్ స్కోరు 108/2.. షఫాలీ హాఫ్ సెంచరీ

ప్రధానంగా షెఫాలీ బ్యాట్ కు పని చెప్పారు. అదుపు తప్పిన బంతులను బౌండరీకి తరలించారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

IND Vs South Africa : భారత్ స్కోరు 108/2.. షఫాలీ హాఫ్ సెంచరీ

Team India

ICC Women’s World Cup : మహిళల ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. సెమీ ఫైనల్ లో చోటు దక్కడానికి భారత్ పోరాడుతోంది. 2022, మార్చి 27వ తేదీ ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలీ వర్మలు ఆటను ఆరంభించారు. ఒక్క బాల్ వేస్ట్ చేయకుండా పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా షెఫాలీ బ్యాట్ కు పని చెప్పారు. అదుపు తప్పిన బంతులను బౌండరీకి తరలించారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ సాధించిన షఫాలీ (53, 46 బంతులు 8 ఫోర్లు) దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యారు. అప్పటికీ జట్టు స్కోరు 91 పరుగులు. అనంతరం స్మృతి మందానతో యాస్తికాభట్టా జత కలిశారు. మరో 5 పరుగులు జోడించిన అనంతరం యాస్తికా 2 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

Read More : India Vs South Africa : మహిళల ప్రపంచ కప్.. భారత్ ముందుకెళుతుందా ?

కప్ సాధించాలనే తపనతో వచ్చిన మిథాలీ సేన బ్యాటింగ్ లో విఫలం చెందుతోంది. మూడు మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. సెమీ ఫైనల్లో చోటు దక్కాలంటే మాత్రం దక్షిణాఫ్రికా జట్టును ఓడించి తీరాల్సి ఉంటుంది. ఆలోచిస్తున్నారు. సెమీ ఫైనల్లో భారత్ ఓడిపోతే.. తనకన్నా మెరుగైన రన్ రేట్ లో ఉన్న ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఓడిపోవాలని భారత అభిమానులు కోరుకోవాల్సి ఉంటుంది. అలా కాకపోతే.. దక్షిణాఫ్రికాను ఓడించాల్సిందే.

Read More : PV Sindhu : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్.. ఫైనల్లో పీవీ సింధు, ప్రణయ్

పాయింట్ల పట్టికలో టాప్ 04లో నిలిచిన జట్లు మాత్రమే సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఆరు మ్యాచ్ లు ఆడి.. అన్నీ మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఆసీస్ మహిళా టీం 12 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్ లు ఆడి.. నాలుగు విజయాలు, ఒకటి ఓటమి, మరొకటి రద్దుతో మొత్తం 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన రెండు బెర్త్ ల కోసం వెస్టిండీస్ (7 పాయింట్లు), ఇంగ్లాండ్ (6 పాయింట్లు), భారత్ (6 పాయింట్లు) పోటీల్లో కొనసాగుతున్నాయి.