ICC World Test 2021 : బంగ్లాదేశ్ చారిత్రక విజయం.. టాప్-4లో టీమిండియా.. టాప్-5లో బంగ్లాదేశ్..!

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ చారిత్రక విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది.

ICC World Test 2021 : బంగ్లాదేశ్ చారిత్రక విజయం.. టాప్-4లో టీమిండియా.. టాప్-5లో బంగ్లాదేశ్..!

Updated Points Table After 1st Test Between New Zealand And Bangladesh (1)

ICC World Test Championship 2021-23 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ చారిత్రక విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో మొదటి మ్యాచ్ విజయం సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో మొదటి WTC టైటిల్‌ విజేతను చిత్తు చేసింది బంగ్లాదేశ్. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో బంగ్లాదేశ్‌ కు మరో 12 పాయింట్లు వచ్చి చేరాయి. దాంతో WTC పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఐదో స్థానానికి ఎగబాకింది.

WTC 2021-23 సీజన్‌లో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ వైట్‌వాష్‌ అయింది. కొత్త ఏడాదిలో న్యూజిలాండ్‌ పర్యటనకు బంగ్లాదేశ్ నూతన ఉత్సాహంతో ఆడింది. కొత్త సంవత్సరంలో చారిత్రక విజయాన్ని అందుకుంది మొమినల్ టీం.. తద్వారా పాయింట్ల పట్టికలో టాప్-5 ర్యాంకులో నిలిచింది.

యాషెస్‌ సిరీస్‌ దక్కించుకున్న ఆస్ట్రేలియా 36 పాయింట్లతో టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఓటమి ఎరుగని శ్రీలంక 24 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక పాకిస్తాన్‌ 36 పాయింట్లతో మూడో స్థానంలో ఉంటే.. టీమిండియా 53 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ 12 పాయింట్లతో 6వ స్థానంలో నిలవగా.. న్యూజిలాండ్ 4 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 6పాయింట్లతో 8వ ర్యాంకులో నిలవగా.. సౌతాఫ్రికా జీరో పాయింట్లతో దిగువనే ఉండిపోయింది.


ఇంగ్లండ్‌ జట్టుతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లలో డ్రాతోపాటు ఒక మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచూరియన్‌లో చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది టీమిండాయా.

Read Also : BBL: క్రికెటర్లను వదలని కరోనా.. మెల్ బోర్న్ స్టార్‌ కెప్టెన్‌కు పాజిటివ్..!