Rahul Dravid: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌‌ నియామకానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నారు.

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?

Dravid

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌‌ నియామకానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన బీసీసీఐ వర్గాలు.. కోచ్‌గా ద్రవిడ్ అపాయింట్ అయితే, జాతీయ క్రికెట్‌ అకాడమీ బాధ్యతలను టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి.

టీ20 ప్రపంచకప్‌‌లో ప్రస్తుతం టీమిండియా ఆడుతుండగా.. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం పూర్తికానుంది. దీంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ముందుగా ప్రధాన కోచ్‌ పదవిపై ద్రవిడ్ పెద్దగా ఆసక్తి చూపలేదంటూ.. సున్నితంగా ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ ఫైనల్ సమయంలో గంగూలీ, ద్రవిడ్, బీసీసీఐ సెక్రటరీ జైషా సమావేశం అయ్యారు. ఆ సమయంలో గంగూలీ, షా కలిసి ద్రవిడ్‌ను ఒప్పించినట్లు తెలుస్తుంది. బీసీసీఐ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు.

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ద్రవిడ్‌ సేవలందిస్తుండగా.. రాహుల్‌ ద్రవిడ్ ఎంతో మంది యువ క్రికెటర్లను భారత జట్టుకు అందించాడు. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉంటే భారత క్రికెట్‌కు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు, బీసీసీఐ అధికారులు. దీంతో ద్రవిడ్ నియామకం లాంఛనమే అంటున్నారు.