AB de Villiers: నేను భారతదేశంలో పుట్టి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగేవాడిని కాదు

క్రికెట్ ప్రపంచంలో మిస్టర్ 360 డిగ్రీగా పాపులర్ అయిన దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ భారత క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

AB de Villiers: నేను భారతదేశంలో పుట్టి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగేవాడిని కాదు

Ab De Villiers

AB de Villiers: క్రికెట్ ప్రపంచంలో మిస్టర్ 360 డిగ్రీగా పాపులర్ అయిన దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ భారత క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పోడ్‌కాస్ట్‌లో డివిలియర్స్ మాట్లాడుతూ.. “నేను భారతదేశంలో పుట్టి ఉంటే, నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగేవాడిని కాదు.” అని అన్నారు.

భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే ప్రత్యేకంగా ఉండాల్సిందేనని, స్పెషల్ ప్లేయర్ అయి ఉంటేనే భారత జట్టులో చోటు దక్కుతుందని డివిలియర్స్ చెప్పాడు. భారత్‌లో ప్రజలు ఆటగాళ్లను గుండెల్లో పెట్టుకుంటారని, ఇండియాలో తన ఆటకు కూడా చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారని చెప్పాడు. అందుకే తాను రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు భార‌త అభిమానులు బాధ‌ప‌డ్డార‌ని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా RCBతో తన సంబంధాన్ని గురించి మాట్లాడుతూ.. Mr.360 డిగ్రీ ఇలా అన్నాడు, “నాకు RCB అనేది కుటుంబం. RCBలో నా కెరీర్‌ నా జీవితంలో అత్యంత అద్భుతమైన సంధర్భాల్లో ఒకటి. IPL క్రికెట్‌ను అనుభవించే అవకాశం నాకు ఆర్‌సీబీ వల్లే లభించింది. భారతీయ ప్రేక్షకులు 15 సంవత్సరాలుగా దగ్గరగా ఉండడానికి కారణం ఐపీఎల్” అని అన్నారు.

ఏబీ డివిలియర్స్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 184 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 39.71 సగటుతో మరియు 151.69 స్ట్రైక్ రేట్‌తో 5162 పరుగులు వచ్చాయి. ఐపీఎల్‌లో ఏబీ మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు చేశాడు. 2008 నుంచి ఈ లీగ్‌లో ఆడుతున్నాడు.