Virat Kohli: “ఆర్సీబీ ఐపీఎల్ గెలిస్తే డివిలియర్స్‌ను చూసి ఎమోషనల్ అయిపోతా”

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత సీజన్‌లో (ఐపీఎల్ 2022)లో గెలిస్తే డివిలియర్స్ గురించి ఆలోచిస్తూ.. తాను ఎమోషనల్ అయిపోతానని అంటున్నాడు.

Virat Kohli: “ఆర్సీబీ ఐపీఎల్ గెలిస్తే డివిలియర్స్‌ను చూసి ఎమోషనల్ అయిపోతా”

Virat Kohli

Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుత సీజన్‌లో (ఐపీఎల్ 2022)లో గెలిస్తే డివిలియర్స్ గురించి ఆలోచిస్తూ.. తాను ఎమోషనల్ అయిపోతానని అంటున్నాడు. ఆర్సీబీతో తనకున్న 11ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన రోజే కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.

ఇక రీసెంట్ గా సీజన్ ఆరంభంలోనే డుప్లెసిస్ ను కెప్టెన్ చేస్తూ.. కీలక ప్రకటన చేసింది ఆర్సీబీ.

2008 నుంచి 2010 వరకూ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో కలిసి ఆడినా.. 2011 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఉండిపోయాడు డివిలియర్స్.

Read Also: డివిలియర్స్ పేరు పిలిచిన అభిమానులు, విరాట్ వెనక్కు చూసి..

‘ప్రస్తుత సీజన్ లో టైటిల్ గెలుచుకుంటే చాలా ఎమోషనల్ అయిపోతా. ఇన్నేళ్లు శ్రమించిన డివిలియర్స్ గురించే ఆలోచిస్తా. అతనికి ఇది చాలా పెద్ద విషయం. అతను ఎక్కడున్నా ప్రతి ఒక్కరికీ టచ్ లో ఉంటాడు. డివిలియర్స్ జట్టు కోసం ఈ పని చేయలేదని ఎవరూ చెప్పలేరు. నాకు ఇంకా గుర్తుంది. దుబాయ్ లో టీ20 వరల్డ్ కప్ తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ఏబీడీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని వాయీస్ మెసేజ్ రూపంలో పంపాడు. చూసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయి అనుష్కను చూస్తుండిపోయా’ అని ఆ క్షణాలను గుర్తు చేసుకున్నాడు కోహ్లీ.

ఏమైందని అనుష్క అడిగితే చెప్పా. దానికి నాకేం చెప్పకు ముందే తెలుసని అనేసింది. ఈ సీజన్ లోనే తప్పుకుంటాడని అనుకుందట. డ్రెస్సింగ్ రూం కూడా తన రూం పక్కనే ఉండేదని హోటల్ కు వెళ్లే ప్రతిసారి కాఫీ దగ్గర కలుద్దామంటూ వీడ్కోలు చెప్పేవాడని, ఆ సమయంలోనే కొద్ది రోజుల్లో మనం కలవమంటూ చెప్పేవాడని కోహ్లీ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.