Dilip Vengsarkar : సూపర్ ఫామ్‌లో ఉన్న అతడిని ఎందుకు తీసుకోవడం లేదు? భారత మాజీ కెప్టెన్ అసహనం

సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న మహారాష్ట్ర రంజీ కెప్టెన్..

Dilip Vengsarkar : సూపర్ ఫామ్‌లో ఉన్న అతడిని ఎందుకు తీసుకోవడం లేదు? భారత మాజీ కెప్టెన్ అసహనం

Dilip Vengsarkar

Dilip Vengsarkar : సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ ఫామ్ లో ఉన్న మహారాష్ట్ర రంజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (24) ను ఎందుకు తీసుకోవడం లేదని సెలెక్టర్లను ప్రశ్నించారు. అతడు ఇంకెన్ని పరుగులు చేస్తే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారని నిలదీశారు.

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా మూడు సెంచరీలు బాది సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకోవడానికి అవసరమైన పరుగులను గైక్వాడ్ సాధించాడని, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అతడిని తప్పకుండా ఎంపిక చేయాలని వెంగీ సూచించారు. సెలెక్టర్లు ఆలస్యం చేయకుండా గైక్వాడ్ ను నేరుగా జాతీయ జట్టులోకి తీసుకుని, తగినన్ని అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. గైక్వాడ్ వన్ డౌన్ లోనూ ఆడగలడని వెల్లడించారు.

Bank Jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41వేలకు పైగా ఉద్యోగాలు

”రుతురాజ్ 18, 19 ఏళ్ల టీనేజి కుర్రాడు అయ్యుంటే అతడికి ఇంకా భవిష్యత్ ఉందని భావించొచ్చు. కానీ ఇప్పుడతని వయసు 24 ఏళ్లు. ఇంకెప్పుడు జట్టులోకి ఎంపిక చేస్తారు. ఇప్పుడు తీసుకోక 28 ఏళ్ల వయసొస్తే అప్పుడు తీసుకుంటారా?” అని వెంగ్ సర్కార్ నిలదీశారు.

PF Interest Money : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్… వడ్డీ డబ్బులు జమ.. ఇలా చెక్ చేసుకోండి..

రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడే ఈ మహారాష్ట్ర క్రికెటర్ 2021 సీజన్ లో ఐపీఎల్ లో 16 మ్యాచుల్లో 635 పరుగులు చేయడం అతడి ఫామ్ కు అద్దం పడుతుంది. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా గైక్వాడ్ రికార్డు నమోదు చేశాడు. తాజాగా, విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలతో మోత మోగించాడు. మధ్యప్రదేశ్ పై 136, చత్తీస్ గఢ్ పై 154 నాటౌట్, కేరళపై 124 పరుగులు చేశాడు.