IND vs ENG, 3rd T20I : విరాట్ కోహ్లీ కుమ్మేశాడు.. ఇంగ్లాండ్ విజయలక్ష్యం 157

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ ; 77 నాటౌట్) వీరబాదుడు బాదేశాడు. హాఫ్ సెంచరీతో కోహ్లీ వన్ మ్యాన్ షోను ప్రదర్శించాడు.

IND vs ENG, 3rd T20I : విరాట్ కోహ్లీ కుమ్మేశాడు.. ఇంగ్లాండ్ విజయలక్ష్యం 157

Ind Vs Eng, 3rd T20i

IND vs ENG, 3rd T20I  : ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ ; 77 నాటౌట్) వీరబాదుడు బాదేశాడు. హాఫ్ సెంచరీతో కోహ్లీ వన్ మ్యాన్ షోను ప్రదర్శించాడు. మిగతా ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరుతుంటే.. విరాట్ ఒక్కడే నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్ల బంతులను బౌండరీలు దాటిస్తూ హాఫ్ సెంచరీని దాటేశాడు.

మిగిలిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ (25) పరుగులుచేయగా. ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులకే చేతులేత్తేశాడు. చివరిలో కోహ్లీకి జతగా వచ్చిన హార్దిక్ పాండ్యా 17 పరుగులకే సరిపెట్టుకోగా.. అయ్యర్ (9), ఇషాన్ కిషాన్ (4), రాహుల్ (0) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ప్రత్యర్థి మోర్గాన్ సేనకు 157 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.


ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (3/31) మూడు వికెట్లు తీసుకోగా.. క్రిస్ జోర్దాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. ఐదు టీ20ల సిరీస్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత స్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ సిరీస్ మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే.. రెండో టీ20 మ్యాచ్ లో కోహ్లీసేన విజయం సాధించింది.