IND vs AUS 1st ODI: టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్.. Live Updates

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. అనంతరం, కేఎల్ రాహుల్ 75 పరుగులతో రాణించడంతో ఆసీస్ పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IND vs AUS 1st ODI: టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్.. Live Updates

India vs Australia

IND vs AUS 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (81) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత్ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 75 పరుగులు బాది నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 17 Mar 2023 08:40 PM (IST)

    టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్

    ODI KL Rahul 75 Not out

    KL Rahul 75 Not out

    IND vs AUS 1st ODI: కేఎల్ రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (3 పరుగులు), శుభ్ మన్ గిల్ (20) సహా విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో టీమిండియా ఆసలు గెలుస్తుందా? అన్న సందేహాలు వచ్చాయి.

    అయితే, 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకుని అద్భుతంగా ఆడాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అతడికి ఇది 13వ అర్ధ సెంచరీ. కేఎల్ రాహుల్ కు రవీంద్ర జడేజా చక్కని సహకారం అందించాడు. రవీంద్ర జడేజా 69 బంతుల్లో 45 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 39.5 ఓవర్లలో 191 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

    టీమిండియా బ్యాటర్లు అందరూ విఫలమైన వేళ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడిన తీరు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఇటీవల టెస్టు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడిని జట్టులోకి తీసుకోవద్దని కొందరు అన్నారు. నేడు కేఎల్ రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌కు 3, స్టోయినిస్‌కు 2 వికెట్లు దక్కాయి.

    అంతకుముందు, భారత బౌలర్లు చెలరేగడంతో 35.4 ఓవర్లకే ఆస్ట్రేలియా 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (81) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ కు మూడేసి వికెట్లు, రవీంద్ర జడేజాకు 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ కు చెరో వికెట్ దక్కాయి. టీమిండియా ముందు ఉన్నది స్వల్ప లక్ష్యమే అయినా కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకోలేకపోతే భారత్ కష్టాల్లో పడేది.

  • 17 Mar 2023 08:10 PM (IST)

    హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్న కేఎల్ రాహుల్

    కేఎల్ రాహుల్ టీమిండియాను ఆదుకుంటున్నాడు. భారత బ్యాటర్లు అందరూ విఫలమైన వేళ 73 బంతుల్లో కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ బాదాడు. ఇటీవల టెస్టు మ్యాచుల్లో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్.. నేటి తొలి వన్డేలో మాత్రం టీమిండియాను గెలిపించే దిశగా దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (54), రవీంద్ర జడేజా (32) ఉన్నారు. టీమిండియా స్కోరు 150/5 (35.0/50)గా ఉంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మధ్య పార్ట్ నర్ షిప్ కూడా 50 దాటింది.

  • 17 Mar 2023 07:01 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

    టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (28), రవీంద్ర జడేజా (2) ఉన్నారు. టీమిండియా స్కోరు 87/5 (21 ఓవర్లకు)గా ఉంది.

  • 17 Mar 2023 06:54 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన టీమిండియా

    టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. శుభ్ మన్ గిల్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 26, హార్దిక్ పాండ్యా 25 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 83/4 (19 ఓవర్లకు)గా ఉంది.

  • 17 Mar 2023 05:49 PM (IST)

    3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా

    టీమిండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 3, విరాట్ కోహ్లీ 4 పరుగులకు ఔట్ కాగా, సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. టీమిండియా స్కోరు 27/3 (7 ఓవర్లకు)గా ఉంది. క్రీజులో శుభ్ మన్ గిల్ 14, కేఎల్ రాహుల్ 5 పరుగులతో ఉన్నారు. 

  • 17 Mar 2023 05:33 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

    టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ 3 పరుగులు చేసి మార్కస్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. క్రీజులో శుభ్ మన్ గిల్ 8, విరాట్ కోహ్లీ 4 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 15/1 (4 ఓవర్లకి)గా ఉంది.

  • 17 Mar 2023 04:34 PM (IST)

    ఆస్ట్రేలియా ఆలౌట్.. టీమిండియా ముందు 189 పరుగుల టార్గెట్

    ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత బౌలర్లు చెలరేగడంతో 35.4 ఓవర్లకే ఆస్ట్రేలియా 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (81) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ కు మూడేసి వికెట్లు, రవీంద్ర జడేజాకు 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ కు చెరో వికెట్ దక్కాయి.

  • 17 Mar 2023 04:25 PM (IST)

    9 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయింది. షమీ బౌలింగ్ లో మార్కస్ ఔటైన వెంటనే గ్లెన్ మాక్స్ వెల్ (8), సీన్ అబ్బాట్ (0) కూడా ఔటయ్యారు. ఆస్ట్రేలియా స్కోరు 188/9 (34 ఓవర్లకు) గా ఉంది.

  • 17 Mar 2023 04:14 PM (IST)

    7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. షమీ బౌలింగ్ లో మార్కస్ (5) వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో గ్లెన్ మాక్స్ వెల్ (3), సీన్ అబ్బాట్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 184/7 (32.0/50) గా ఉంది.

  • 17 Mar 2023 04:02 PM (IST)

    6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయింది. షమీ బౌలింగ్ లో జోష్ ఇంగ్లిస్ (26) ఔటైన కాసేపటికే కామెరాన్ గ్రీన్ (12) కూడా షమీ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. క్రీజులో గ్లెన్ మాక్స్ వెల్ (3), మార్కస్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 174/6 (30 ఓవర్లకు) గా ఉంది.

  • 17 Mar 2023 03:53 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయింది. షమీ బౌలింగ్ లో జోష్ ఇంగ్లిస్ (26) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో, కామెరాన్ గ్రీన్ (12), గ్లెన్ మాక్స్ వెల్ (3) ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 174/5 (29 ఓవర్లకు)గా ఉంది.

  • 17 Mar 2023 03:24 PM (IST)

    నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో మార్నస్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. క్రీజులో జోస్ ఇంగ్లిస్ (6), కామెరాన్ గ్రీన్ (1) ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 140/4 (23 ఓవర్లకు)గా ఉంది.

  • 17 Mar 2023 03:14 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 3వ వికెట్ కోల్పోయింది. 64 బంతుల్లో 81 పరుగులు చేసిన మిచెల్ మార్ష్... రవీంద్ర జడేజా బౌలింగ్ లో సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. క్రీజులోకి జోస్ ఇంగ్లిస్ వచ్చాడు. మార్నస్ 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్కోరు 129/3 (20 ఓవర్లకు)గా ఉంది.

  • 17 Mar 2023 02:59 PM (IST)

    మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ

    ఓపెనర్ మిచెల్ మార్ష్ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ప్రస్తుతం అతడి స్కోరు 58గా ఉంది. అందులో 3 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. క్రీజులో అతడితో పాటు మార్నస్ (8) ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 103/2 (17.0/50)గా ఉంది.

  • 17 Mar 2023 02:41 PM (IST)

    2వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 2వ వికెట్ కోల్పోయింది. 12.3 ఓవర్ల వద్ద స్టీవెన్ స్మిత్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 77/2 (12.3/50)గా ఉంది. మిచెల్ మార్ష్ (40), మార్నస్ (0) క్రీజులో ఉన్నారు.

  • 17 Mar 2023 02:25 PM (IST)

    10 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 59/1

    ఆసీస్ బ్యాట్స్‌మెన్లు స్టీవ్ స్మిత్ (16), మిచెల్ మార్ష్ (31) దూకుడుగా ఆడుతున్నారు. దీంతో ఆసీస్ స్కోర్ 10 ఓవర్లకు 59/1 చేరింది.

  • 17 Mar 2023 02:10 PM (IST)

    7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 37/1

    ఆస్ట్రేలియా ఆదిలోనే వికెట్ కోల్పోయినప్పటికీ వేగంగా పరుగులు రాబడుతుంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (17), స్టీవ్ స్మిత్ (9) క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 37/1.

  • 17 Mar 2023 01:55 PM (IST)

    నాలుగు ఓవర్లకు ఆస్ట్రేలియా 19/1..

    ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ హెడ్  ఔట్ కావడంతో.. స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ మార్ష్ ( 9 బంతుల్లో 13పరుగులు) దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 19/1.

  • 17 Mar 2023 01:46 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్లో ట్రావిస్ హెడ్ (5) బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. ప్రస్తుతం భారత్  స్కోర్  5/1.

  • 17 Mar 2023 01:42 PM (IST)

    ఆస్ట్రేలియా తుది జట్టు..

    ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్); మార్నస్ లబుషేన్, జోస్ ఇంగ్లిష్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్లోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

  • 17 Mar 2023 01:39 PM (IST)

    భారత్‌ జట్టు ..

    ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

     

  • 17 Mar 2023 01:38 PM (IST)

    ఫీల్డింగ్ ఎంచుకున్న హార్దిక్ ..

    ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.