IND Vs AUS 1st Test : నాగ్‌పూర్ టెస్ట్.. ముగిసిన తొలి రోజు ఆట, భారత్‌దే పైచేయి

నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత ఆసీస్ ను 177 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆపై ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.

IND Vs AUS 1st Test : నాగ్‌పూర్ టెస్ట్.. ముగిసిన తొలి రోజు ఆట, భారత్‌దే పైచేయి

IND Vs AUS 1st Test : నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత స్పిన్నర్లు మాయాజాలం చేశారు. ఆసీస్ ను 177 పరుగులకే కుప్పకూల్చారు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది భారత్.

కెప్టెన్ రోహిత్ శర్మ (56*), నైట్ వాచ్ మన్ రవిచంద్రన్ అశ్విన్(0) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ 100 పరుగులు వెనుకబడి ఉంది.

టీమిండియా ఇన్నింగ్స్ లో రోహిత్ ధాటిగా ఆడాడు. 9 ఫోర్లు, 1 సిక్స్ తో చెలరేగాడు. మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో 71 బంతులాడి 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాహుల్ స్కోరులో ఒక బౌండరీ మాత్రమే ఉందంటే అతడి బ్యాటింగ్ ఎంత నిదానంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా బౌలింగ్ దళంలో ప్రధాన బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

Also Read..KS Bharat: భారత్ జట్టులో ఆంధ్రా కుర్రాడు.. టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్.. అమ్మను హత్తుకొని భావోద్వేగానికి గురైన క్రికెటర్ ..

టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే ఆ జట్టుకి భారీ షాక్ లు తగిలాయి. ఆ జట్టు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ ను సిరాజ్ తీయగా, రెండో వికెట్ ను షమీ పడగొట్టాడు. ఎంతో అనుభవమున్న ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (1), డేవిడ్ వార్నర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్ (49), స్టీవ్ స్మిత్ (37) జోడీ నిలకడగా ఆడారు. అయితే, స్పిన్నర్ల రంగప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. జడేజా, అశ్విన్ పోటాపోటీగా వికెట్లు తీసి భారత్ కు తొలి రోజు ఆటలో పైచేయి సాధించి పెట్టారు.

ముఖ్యంగా, పిచ్ నుంచి సహకారం అందుకున్న జడేజా ఆసీస్ మిడిలార్డర్ ను అతలాకుతలం చేశాడు. ఫామ్ లో ఉన్న లబుషేన్, స్మిత్ ల వికెట్ల తోపాటు మాట్ రెన్ షా (0), పీటర్ హాండ్స్ కోంబ్ (31), టాడ్ మర్ఫీ (0)లను అవుట్ చేసి కంగారూలను కోలుకోలేని దెబ్బకొట్టాడు.

Also Read..Border-Gavaskar Trophy: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య 5 అతి పెద్ద వివాదాలు ఇవే..

మరో ఎండ్ లో అశ్విన్ ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (36) పోరాటానికి అద్భుతమైన బంతితో తెరదించాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (6) వికెట్ కూడా అశ్విన్ ఖాతాలోకే చేరింది. ఆసీస్ టెయిలెండర్ స్కాట్ బోలాండ్ ను బౌల్డ్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ కు అశ్విన్ తెరదించాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గతేడాది గాయానికి గురై కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలోనే సత్తా చాటాడు. జడేజా తన లెఫ్టార్మ్ స్పిన్ తో ఆసీస్ వెన్ను విరిచాడు. 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసి ఆసీస్ పతనంలో తనవంతు రోల్ ప్లే చేశాడు.