IND vs AUS 2nd ODI: అతిపెద్ద ఓటమిని చవిచూసిన భారత్

భారత్ అతిపెద్ద ఓటమిని చవిచూసింది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డేలో పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. నిన్న భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలిచింది. నిన్న టీమిండియా చవిచూసిన ఓటమి మామూలు అపజయం కాదు.

IND vs AUS 2nd ODI: అతిపెద్ద ఓటమిని చవిచూసిన భారత్

IND vs AUS 2nd ODI

IND vs AUS 2nd ODI: భారత్ అతిపెద్ద ఓటమిని చవిచూసింది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డేలో పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. నిన్న భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలిచింది. నిన్న టీమిండియా చవిచూసిన ఓటమి మామూలు అపజయం కాదు.

నిన్న ఆసీస్ విజయం సాధించాక ఇంకా 234 బంతులు మిగిలి ఉన్నాయి. మిగిలిపోయిన ఈ బంతుల పరంగా టీమిండియాకు ఇదే అదిపెద్ద అపజయం. సొంత గడ్డపై టీమిండియా వన్డేలో పది వికెట్ల తేడాతో పరాజయం పాలవడం ఇది రెండోసారి. ఆస్ట్రేలియా చేతిలోనే, 2020లో ముంబైలో జరిగిన వన్డేలో టీమిండియా మొట్టమొదటిసారి పది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

సొంత గడ్డపై టీమిండియా 10 వికెట్లను పేసర్ల చేతిలోనే కోల్పోవడం కూడా ఇది రెండోసారి. గువాహటిలో 2009లో ఆస్ట్రేలియా పేసరన్లు బొలింగర్‌ (5 వికెట్లు), మిచెల్‌ జాన్సన్‌ 3, వాట్సన్‌ 2 వికెట్లు తీశారు. కాగా, మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా-ఆస్ట్రేలియా 1-1తో సమఉజ్జీలుగా ఉన్నాయి. మొదటి వన్డేలో కేఎల్ రాహుల్ రాణించడంతో భారత్ గెలుపొందింది. రెండో వన్డేలో మాత్రం ఏ బ్యాటర్ కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో వన్డేపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

IND vs AUS 2nd ODI Live Updates in Telugu: విశాఖ వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం.. పది వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్.. సిరీస్ సమం