IND vs AUS 2nd ODI Live Updates in Telugu: విశాఖ వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం.. పది వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్.. సిరీస్ సమం
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి, ఓపెనర్లే ఆస్ట్రేలియాను గెలిపించడం విశేషం. ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీలతో చెలరేగారు.

IND vs AUS 2nd ODI LiveUpdates in Telugu
IND vs AUS 2nd ODI LiveUpdates in Telugu: విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి, ఓపెనర్లే ఆస్ట్రేలియాను గెలిపించడం విశేషం. ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. స్వల్ప లక్ష్యాన్ని మరింత త్వరగా చేధించారు. ట్రావిస్ హెడ్ 51 పరుగులతో, మార్ష్ 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ట్రావిస్ హెడ్ పది ఫోర్లు, మార్ష్ ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమైంది. ఆస్ట్రేలియా మాత్రం బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో సత్తా చాటింది. మూడు వన్డేల సిరీస్‌లో రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సమానంగా నిలిచాయి. మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో, 117 పరుగులకే భారత్ ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (31), అక్షర్ పటేల్ (29) పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. శుభ్‌మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యారు. రోహిత్ శర్మ 13 పరుగులు, కేఎల్ రాహుల్ 9, హార్ధిక్ పాండ్యా 1, రవీంద్ర జడేజా 16, కుల్దీప్ యాదవ్ 4 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ ఐదు వికెట్లు, అబాట్ 3 వికెట్లు, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీశారు.
LIVE NEWS & UPDATES
-
అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముందు నుంచి ధాటిగా ఆడుతున్న మార్ష్ 28 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం మార్ష్ 61 పరుగులతో, ట్రావిస్ హెడ్ 41 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఆసీస్ ప్రస్తుత స్కోరు 106/0 (9.3 ఓవర్లు)
-
బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా
118 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇద్దరూ ధాటిగా ఆడుతున్నారు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ తలో 10 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా స్కోరు 24/0 (3 ఓవర్లు).
-
తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 103 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 103 పరుగుల వద్ద మొదట కుల్దీప్ యాదవ్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మొహమ్మద్ షమి తొలి బంతికే డకౌటయ్యాడు. అబాట్ బౌలింగ్‌లో అలెక్స్‌కు క్యాచ్ ఇచ్చి షమి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మొహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ ఉన్నారు. స్కోరు 103/9.
-
వంద పరుగులు దాటిన టీమిండియా
భారత్ వంద పరుగులు పూర్తి చేసుకుంది. 22.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ వంద పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కొనసాగుతున్నారు.
-
ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. రవీంద్ర జడేజా ఔట్
91 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అలెక్స్‌కు క్యాచ్ ఇచ్చి రవీంద్ర జడేజా ఔటయ్యాడు. జడేజా 39 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఒక ఫోర్ సాధించాడు. ప్రస్తుతం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారు.
-
ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. విరాట్ కోహ్లీ ఔట్
71 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 35 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 31 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు ఉన్నాయి. కోహ్లీ అనంతరం అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు దిగాడు. క్రీజులో రవీంద్ర జడేజా, అక్షర్ ఉన్నారు.
-
15 ఓవర్లకు 70/5
టీమిండియా స్కోరు 15 ఓవర్లకు 70/5గా ఉంది. విరాట్ కోహ్లీ 31, రవీంద్ర జడేజా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
టీమిండియా స్కోరు 11 ఓవర్లకు 54/5
టీమిండియా స్కోరు 11 ఓవర్లకు 54/5 గా ఉంది. విరాట్ కోహ్లీ 23, రవీంద్ర జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
4 కీలక వికెట్లు తీసిన స్టార్క్
టీమిండియా ఇప్పటివరకు 5 వికెట్లు కోల్పోగా, అందులో 4 వికెట్లు తీసింది ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్కే. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ వికెట్లను తీసి టీమిండియాను పీకల్లోతు కష్టాల్లో నెట్టేశాడు. టీమిండియా స్కోరు 51/5 (10 ఓవర్లకు)గా ఉంది.
-
49 పరుగులకే 5 వికెట్లు
టీమిండియా 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా కూడా 1 పరుగుకే ఔటయ్యాడు.
-
48 పరుగులకే 4 వికెట్లు
భారత్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ 9 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు. టీమిండియా స్కోరు 48/4 (8.4 ఓవర్లకు)గా ఉంది. కోహ్లీ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సూర్య ఔట్ అయిన తర్వాత క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు.
-
32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
భారత్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ 4.5 ఓవర్ల వద్ద డకౌట్ అయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. టీమిండియా స్కోరు 32/3 (5 ఓవర్లకు)గా ఉంది.
-
2 వికెట్లు కోల్పోయిన భారత్
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 4.4 ఓవర్ల వద్ద, 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
-
2 ఓవర్లకు భారత్ స్కోరు 19/1
2 ఓవర్లకు భారత్ స్కోరు 19/1గా ఉంది. రోహిత్ శర్మ 10, కోహ్లీ 6 పరుగులు తీశారు.
-
తొలి ఓవర్లో భారత్ స్కోరు 8/1
తొలి ఓవర్లో భారత్ స్కోరు 8/1. రోహిత్ శర్మ 5, కోహ్లీ 1 పరుగు తీశారు.
-
తొలి ఓవర్ లోనే గిల్ ఔట్
భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ వచ్చారు. అయితే, తొలి ఓవర్లలోనే మూడో బాల్ కి గిల్ డకౌట్ అయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు.
-
ఆస్ట్రేలియా జట్టు
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, మార్ష్, లాబుస్చగ్నే, స్మిత్, కామెరాన్ గ్రీన్, కారీ, స్టొయినిస్, స్టార్క్స్, ఎల్లిస్, అబ్బాట్, జంపా.
-
భారత జట్టు
భారత జట్టు: శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కు తుది జట్టులో చోటు దక్కలేదు.
IND vs AUS 2nd ODI LiveUpdates
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
🚨 Toss Update 🚨
Australia have elected to bowl against #TeamIndia in the second #INDvAUS ODI.
Follow the match ▶️ https://t.co/dzoJxTOHiK@mastercardindia pic.twitter.com/4lrsbQGW4p
— BCCI (@BCCI) March 19, 2023
-
Of fiery fast bowling spells ⚡️⚡️ in hot Mumbai weather ☀️ to the importance of recovery 👏🏻👏🏻
Pacers @mdsirajofficial and @MdShami11 assemble after #TeamIndia’s win in the first #INDvAUS ODI 👌🏻👌🏻 - By @RajalArora
FULL INTERVIEW 🎥🔽 https://t.co/xwNyvD6Uwk pic.twitter.com/35FrdqEhli
— BCCI (@BCCI) March 18, 2023
-
వరుణుడు కరుణించడంతో మారిన వాతావరణం
11 AM update :
Drizzle has stopped. Dense clouds have cleared the sky. Overcast conditions currently. Few thunders are audible. #INDvsAUS #Visakhapatnam https://t.co/UlENi5EFtd pic.twitter.com/yOxVHN6bPx— M S SRIKAR (Vizag Stadium Weatherman 🤪) (@M_S_Srikar) March 19, 2023