IndVsAus 3rd ODI : ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ పరాజయం.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది.(IndVsAus 3rd ODI)

IndVsAus 3rd ODI : ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ పరాజయం.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

IndVsAus 3rd ODI : ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది. ఈ ఓటమితో 2-1 తేడాతో సిరీస్ ను ఆస్ట్రేలియాకు కోల్పోయింది.

మూడో వన్డేలో తొలి నుంచి భారత్ గెలుపు దిశగా సాగింది. అయితే.. సూర్య, పాండ్యా, జడేజా వికెట్లు పడటంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్లింది. చివర్లో షమీ బౌండరీలు బాదినా.. రన్ రేట్ ఎక్కువ ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. భారత్ కు ఓటమి తప్పలేదు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో జంపా 4 వికెట్లు తీశాడు. అగర్ 2 వికెట్లు పడగొట్టాడు. స్టొయినిస్, షాన్ అబ్బాట్ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ ను భారత్ చాలా ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ, స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటం భారత్ ను ఇబ్బందుల్లో పడేసింది. దీంతో టార్గెట్ చేరుకోవడం కష్టంగా మారింది.(IndVsAus 3rd ODI)

Also Read..Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!

ఓ దశలో హార్దిక్ పాండ్యా (40) ధాటిగా ఆడుతుండడంతో భారత్ గెలుపు సులభమేనని అనిపించింది. అయితే ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా విజృంభించి బౌలింగ్ చేయడంతో భారత్ కు పరాజయం తప్పలేదు. జంపా 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. అత్యధికంగా 54 పరుగులు చేశాడు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ 37, కెప్టెన్ రోహిత్ శర్మ 30, కేఎల్ రాహుల్ 32 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, పాండ్యా చెరో 3 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

స్కైకి ఏమైంది? హ్యాట్రిక్ డకౌట్
కాగా, మూడో వన్డేలోనూ టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. తీవ్రంగా నిరాశపరించాడు. సూర్య మళ్లీ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే ఔట్ అయ్యాడు. అగర్ బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలి బంతికే సూర్య క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదే సిరీస్ లో ముందు జరిగిన రెండు వన్డేల్లోనూ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలి బంతికే సూర్య ఎల్బీగా వెనుదిరిగాడు. మొత్తంగా సూర్య వరుసగా మూడో వన్డేలోనూ ఫస్ట్ బాల్ కు ఔట్ అయ్యాడు.(Ind Vs Aus 3rd ODI)

Also Read..Asia Cup-2023: ఇది యుద్ధాలు చేసుకునే తరం కాదు.. పాక్ కు టీమిండియా రావాలి: షాహిద్ అఫ్రిదీ

టీ20ల్లో బౌలర్ ఎంతటివాడైనా చుక్కలు చూపించే డాషింగ్ బ్యాట్స్ మన్ గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. కానీ, వన్డేల్లో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ కు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్.. ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ ల్లోనూ డకౌట్ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చెన్నై వన్డేలోనూ అతడి తలరాత మారలేదు. ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ కే ఔట్ అయ్యాడు. తన బ్యాటింగ్ పట్ల తానే దిగ్భ్రాంతికి లోనయ్యాడు.(Ind Vs Aus 3rd ODI)

తొలి వన్డేలో స్టార్క్ బౌలింగ్ లో ఎదుర్కొన్న తొలి బంతికే సూర్య ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రెండో వన్డేలోనూ అచ్చం అదే రీతిలో స్టార్క్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇది కూడా తొలి బంతికే. వరుసగా రెండుసార్లు సున్నాలు చుట్టి గోల్డెన్ డక్ సాధించాడు. బుధవారం(మార్చి 22) మూడో మ్యాచ్ లోనూ అందరినీ నివ్వెరపరుస్తూ సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే అవుట్ కాగా, ప్రేక్షకులు ఒక్కసారిగా మూగబోయారు. టీ20 క్రికెట్ లో బౌలర్లను ఊచకోత కోస్తూ మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య ఇంత దారుణంగా ఆడుతుండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.