IND vs AUS 3rd ODI: భారత్ పరాజయం.. వన్డే సిరీస్ ఆస్ట్రేలియా వశం

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. 21 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

IND vs AUS 3rd ODI: నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. 21 రన్స్ తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది. 270 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీశారు. టీమిండియా ముందు ఆసీస్ 270 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 22 Mar 2023 09:37 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్

    భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అడం జంపా బౌలింగ్ లో వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు 219/7 (44 ఓవర్లకు)గా ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా (17), కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు.

  • 22 Mar 2023 09:17 PM (IST)

    టీమిండియా స్కోరు 40 ఓవర్లకు 204/6

    టీమిండియా స్కోరు 40 ఓవర్లకు 204/6గా ఉంది. క్రీజులో హార్దిక్ పాండ్యా 36, రవీంద్ర జడేజా 8 పరుగులతో ఉన్నారు.

  • 22 Mar 2023 08:51 PM (IST)

    6 వికెట్లు కోల్పోయిన టీమిండియా

    టీమిండియా 6 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ 54 పరుగులు చేసి ఔటైన వెంటనే సూర్య కుమార్ యాదవ్ క్రీజులో వచ్చి, డకౌట్ గా వెనుదిగిరాడు.

  • 22 Mar 2023 08:48 PM (IST)

    అర్ధ సెంచరీ బాది విరాట్ కోహ్లీ ఔట్..

    విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ బాది ఔట్ అయ్యాడు. 54 పరుగులు చేసి అగర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో హార్దిక్ పాండ్యా 28 పరుగులతో ఉన్నాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. టీమిండియా స్కోరు 185/5 (35 ఓవర్లకు)గా ఉంది. 

  • 22 Mar 2023 08:25 PM (IST)

    అర్ధ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ

    విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ బాదాడు. 61 బంతుల్లో ఒక సిక్సు, రెండు ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇది అతడి 65వ అర్ధసెంచరీ. క్రీజులో కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా ఉన్నాడు. టీమిండియా స్కోరు 153/4 (30.1/50) గా ఉంది.

  • 22 Mar 2023 08:20 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

    టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 32 పరుగులు చేసి ఔటైన కొద్ది సేపటికే అక్షర్ పటేల్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. టీమిండియా స్కోరు 151/4 (29 ఓవర్లకు)గా ఉంది. 

  • 22 Mar 2023 08:12 PM (IST)

    కేఎల్ రాహుల్ ఔట్

    టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 45 పరుగులు, అక్షర్ పటేల్ 1 పరుగుతో ఉన్నారు. టీమిండియా స్కోరు 147/3 (28 ఓవర్లకు)గా ఉంది.

  • 22 Mar 2023 07:28 PM (IST)

    100 దాటిన టీమిండియా స్కోరు

    టీమిండియా స్కోరు 100 దాటింది. విరాట్ కోహ్లీ 25, కేఎల్ రాహుల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 104/2 (18 ఓవర్లకు)గా ఉంది.

  • 22 Mar 2023 07:09 PM (IST)

    గిల్ 37 పరుగులు చేసి ఔట్

    శుభ్ మన్ గిల్ 37 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో కోహ్లీ 9, కేఎల్ రాహుల్ 2 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 13 ఓవర్లకి  80/2గా ఉంది.

  • 22 Mar 2023 06:52 PM (IST)

    రోహిత్ శర్మ ఔట్..

    రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. 16 బంతుల్లో 2 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి అబ్బాట్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో శుభ్ మన్ గిల్ 35, విరాట్ కోహ్లీ 1 పరుగుతో ఉన్నారు. టీమిండియా స్కోరు 68/1 (10.3/50)గా ఉంది.

  • 22 Mar 2023 06:41 PM (IST)

    వికెట్ పడకుండా 50 దాటిన టీమిండియా స్కోరు

    టీమిండియా స్కోరు వికెట్ పడకుండా 50 దాటింది. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ స్పీడు పెంచారు. రోహిత్ శర్మ 18 పరుగులతో, శుభ్ మన్ గిల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 22 Mar 2023 06:17 PM (IST)

    2 ఓవర్లకు 7 పరుగులు

    టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తొలి రెండు ఓవర్లలో నిదానంగా ఆడారు. 2 ఓవర్లకు టీమిండియా స్కోరు 7గా ఉంది. రోహిత్ శర్మ 2, శుభ్ మన్ గిల్ 3 పరుగులు చేశారు.

  • 22 Mar 2023 06:11 PM (IST)

    టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం

    టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ వచ్చారు.

  • 22 Mar 2023 05:35 PM (IST)

    టీమిండియా టార్గెట్ 270

    ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. 49 ఓవర్లలో ఆస్ట్రేలియా 269 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 33, మిచెల్ మార్ష్ 47, స్మిత్ 0, డేవిడ్ వార్నర్ 23, మార్నస్ 28, అలెక్స్ 38, స్టొయినిస్ 25, అబ్బాట్ 26, అగర్ 17, మిచెల్ స్టార్క్ 10 జంపా 10 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా ముందు ఆసీస్ 270 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

  • 22 Mar 2023 05:17 PM (IST)

    9వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 9వ వికెట్ కోల్పోయింది. అబ్బాట్ 26, అగర్ 17 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 248/9 (45.4/50)గా ఉంది.

  • 22 Mar 2023 04:38 PM (IST)

    7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. స్టోయినిస్ 25 పరుగులకు ఔటైన వెంటనే అలెక్స్ 38 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అబ్బాట్ (1), అగర్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు ప్రస్తుతం 203/7 (38.2/50)గా ఉంది.

  • 22 Mar 2023 04:31 PM (IST)

    6వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 6వ వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ (32), అబ్బాట్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు ప్రస్తుతం 196/6 (37 ఓవర్లకు)గా ఉంది.

  • 22 Mar 2023 03:50 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 5వ వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 23 పరుగుల వద్ద ఔటైన కాసేపటికే మార్నస్ కూడా 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ (5). స్టోయినిక్ (0) ఉన్నాడు. ఆస్ట్రేలియా స్కోరు ప్రస్తుతం 138/5 (28.1/50)గా ఉంది.

  • 22 Mar 2023 03:34 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మార్నస్ (20), అలెక్స్ (0) క్రీజులో ఉన్నారు. తొలి మూడు వికెట్లు టీమిండియా బౌలర్ హార్దిక్ పాండ్యా తీసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా స్కోరు ప్రస్తుతం 128/4 (26.0/50)గా ఉంది.

  • 22 Mar 2023 03:21 PM (IST)

    ఆస్ట్రేలియా స్కోరు 22 ఓవర్లకు 113/3

    ఆస్ట్రేలియా స్కోరు 22 ఓవర్లకు 113/3గా ఉంది. క్రీజులో డేవిడ్ వార్నర్ (22 పరుగులు), మార్నస్ (9) ఉన్నారు. తొలి మూడు వికెట్లు టీమిండియా బౌలర్ హార్దిక్ పాండ్యా తీశాడు.

  • 22 Mar 2023 02:56 PM (IST)

    హార్ధిక్ జోరు.. ఆసీస్ మూడో వికెట్ డౌన్ ..

    ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టిస్తున్నాడు. మూడు వికెట్లు హార్ధిక్ బౌలింగ్ లోనే ఉండటం గమనార్హం. అర్థ సెంచరీకి దగ్గరగా వచ్చిన మార్ష్ (47) సైతం హార్ధిక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

  • 22 Mar 2023 02:39 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్..

    ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. హెడ్ ఔట్ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌట్ అయ్యాడు. హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రెండు వికెట్లు హార్ధిక్ పాండ్యాకే దక్కాయి.

  • 22 Mar 2023 02:31 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్..

    ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ (33) పరుగుల వద్ద హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కుల్దీప్ చేతికి చిక్కాడు.

  • 22 Mar 2023 02:20 PM (IST)

    10 ఓవర్లకు 61 రన్స్..

    ఆస్ట్రేలియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ స్కోర్ 61/0. మిచెల్ మార్ష్ (33), హెడ్ (27) పరుగులతో క్రీజులో ఉన్నారు. అక్షర్ పటేల్, సిరాజుద్దీన్ బౌలింగ్ వేస్తున్నారు.

  • 22 Mar 2023 02:04 PM (IST)

    ఆరు ఓవర్లకు 41/0

    ఆసీస్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 41/0 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. మార్ష్ 18 బంతుల్లో 28 పరుగులతో క్రీజులో ఉన్నాడు. హెడ్ 12 పరుగులు చేశాడు.

  • 22 Mar 2023 01:53 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న మార్ష్..

    మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతున్నాడు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి మార్ష్ (23), హెడ్ (4) క్రీజులో ఉన్నారు. మార్ష్ కేవలం 15 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్ , నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా స్కోర్ నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి 28 పరుగులు చేసింది.

  • 22 Mar 2023 01:51 PM (IST)

    టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారు వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ లు వచ్చారు.

  • 22 Mar 2023 01:48 PM (IST)

    టీమిండియా తుది జట్టు

    రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్య కుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌

     

  • 22 Mar 2023 01:46 PM (IST)

    మార్పులు లేకుండా బరిలోకి భారత్..

    మూడో వన్డేలో భారత జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. రెండో వన్డేలో ఆడిన ప్లేయర్లే మూడో వన్డేలో ఆడనున్నారు.

  • 22 Mar 2023 01:44 PM (IST)

    ఆస్ట్రేలియా తుది జట్టు ఇలా..

    ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, అలెక్స్‌ కారీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆస్టన్‌ అగర్‌, సీన్‌ అబాట్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా.

  • 22 Mar 2023 01:43 PM (IST)

    ఆస్ట్రేలియా జట్టు మూడో వన్డేలో రెండు మార్పులు చేసింది. డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ ఆస్టన్ ఆగర్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు