IND vs AUS 4th Test Match, Live Updates In Telugu: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు… సిరీస్ భారత్ కైవసం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

IND vs AUS 4th Test Match LiveUpdates In Telugu: ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. మరోవైపు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరింది.
ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడుతుంది. నాలుగో టెస్టు, ఐదో రోజైన సోమవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ కొనసాగింది. అయితే, మ్యాచ్ ముగిసేందుకు కొన్ని గంటలే ఉండటం, మరో ఇన్నింగ్స్‌కు అవకాశం లేకపోవడం వల్ల మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేదు. దీంతో మ్యాచ్ ముగించాలని ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయించారు. దీంతో మధ్యాహ్నం 03.20 గంటల సమయంలో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు కెప్టెన్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేయగా, ఇండియా 571 పరుగులు చేసింది.
మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 175/2 స్కోరుతో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఖవాజా 180 పరుగులు, కామెరూన్ గ్రీన్ 114 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 128 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 186 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు, షమి రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ 90 పరుగులు, మార్నస్ 63 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా 175 పరుగుల వద్ద మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు
LIVE NEWS & UPDATES
-
డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు... సిరీస్ భారత్ కైవసం
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. మరోవైపు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరింది. ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియతో ఇండియా తలపడుతుంది.
-
90 పరుగులు చేసి హెడ్ ఔట్
ఆస్ట్రేలియా బ్యాటర్లు హెడ్, మార్నస్ అర్ధ సెంచరీలు చేశారు. హెడ్ అర్ధ సెంచరీ చేసిన తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెడ్... అక్షర్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మార్నస్ (51 పరుగులు), స్టీవెన్ స్మిత్ (0) ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్కోరు 158/2 (63 ఓవర్లు)గా ఉంది.
-
ధాటిగా ఆడుతున్న హెడ్, మార్నస్
ఆస్ట్రేలియా బ్యాటర్లు హెడ్, మార్నస్ ధాటిగా ఆడుతున్నారు. 131 బంతుల్లో హెడ్ 75 పరుగులు, మార్నస్ 128 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్కోరు 121/1 (49 ఓవర్లకు)గా ఉంది.
-
భోజన విరామం.. ఆసీస్ 73/1
భోజన విరామ సమయానికి ఆసీస్ స్కోరు 73/1 (36 ఓవర్లకి)గా ఉంది. ఆసీస్ ఇంకా 18 పరుగులు వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 571, ఆస్ట్రేలియా 480 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
-
50 దాటిన ఆస్ట్రేలియా స్కోరు
రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్కోరు 50 దాటింది. క్రీజులో ట్రావిస్ హెడ్ (30), మార్నస్ (15) ఉన్నారు. స్కోరు 51/1 (27 ఓవర్లకు)గా ఉంది.
-
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. మాథ్యూ కుహ్నెమాన్ 6 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. క్రీజులో ట్రావిస్ హెడ్ (8), మార్నస్ (0) ఉన్నారు.
-
7 ఓవర్లకి స్కోరు 8/0
ఓపెనర్లు మాథ్యూ కుహ్నెమాన్ 4, ట్రావిస్ హెడ్ 4 పరుగులు చేశారు. స్కోరు 8/0 (7 ఓవర్లకి)గా ఉంది.
Welcome to the final day of the Fourth #INDvAUS Test!
An action-packed day awaits with Australia still 88 runs behind in the second innings.
What are your Day 5️⃣ predictions❓ #TeamIndia
Follow the match - https://t.co/8DPghkx0DE @mastercardindia pic.twitter.com/2X5qea8b5G
— BCCI (@BCCI) March 13, 2023