WTC 2023 Final: 106 బంతుల్లో సెంచరీ బాదిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్.. స్మిత్ హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియాలోని ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది.

Pic Source: @BCCI
WTC 2023 Final – Updates: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా (Team India) ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా(Australia)లోని ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా తుదిజట్టులో అశ్విన్ లేడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు.
కాసేపటికే ఉస్మాన్ ఖవాజా సిరాజ్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. లంచ్ సమయం (23 ఓవర్లు) నాటికి ఆస్ట్రేలియా స్కోరు 73/2గా ఉంది. అనంతరం మార్నస్ 26 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ట్రావిస్ హెడ్ 106 బంతుల్లో సెంచరీ బాదాడు. క్రీజులో స్టీవెన్ స్మిత్ 53, ట్రావిస్ హెడ్ 100 పరుగులతో ఉన్నారు. స్కోరు 65 ఓవర్ల నాటికి 238/3గా ఉంది.
టీమిండియా తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Pic Source: @BCCI
ఆస్ట్రేలియా తుది జట్టు
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్