IND vs BAN Test Match: నేటి నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే..!

కే.ఎల్. రాహుల్ సారథ్యంలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో తుది జట్టు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో మార్పులు చేర్పులతో గజిబిజి గందరగోళంగా ఉన్న టీమిండియా.. ఇవాళ జరిగే టెస్టు మ్యాచ్‌కు ఏ విధంగా తుది జట్టుకూర్పు ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

IND vs BAN Test Match: నేటి నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే..!

India vs bangla Test Match

IND vs BAN Test Match: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు జహుర్ అహ్మద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టుకు ఓ పరీక్ష అనే చెప్పాలి. బంగ్లాపై వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న భారత్ జట్టు.. టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకొని ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే పరిమిత ఓవర్లలో వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాకు ఈ టెస్టు గెలుపు ఎంతో అవసరం. ఇప్పటి వరకు ఇండియాకు బంగ్లా జట్టుపై టెస్టుల్లో ఓడిపోయిన దాఖలాలు లేవు. అయితే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో స్థానం దక్కించుకోవాలంటే టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ లో మన ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్న దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

BAN vs IND 2nd ODI: టీమిండియాకు బిగ్ షాక్.. ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ..

కే.ఎల్. రాహుల్ సారథ్యంలో జరిగే ఈ మ్యాచ్‌లో తుది జట్టు ఎలా ఉండబోతుంది అనేదికూడా ఆసక్తికరంగా మారింది. జట్టులో మార్పులు చేర్పులతో గజిబిజి గందరగోళంగా ఉన్న టీమిండియా ఇవాళ జరిగే టెస్టు మ్యాచ్ కు ఏ విధంగా తుది జట్టు కూర్పు ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ, షమీ వంటి సీనియర్లు, పలువురు యువ ఆటగాళ్లు గాయాలతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇవాళ జరిగే మ్యాచ్‌లో సరైన జట్టు ఎంపిక జరగక టీమిండియా ఓడితే అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పై ప్రభావం చూపుతుందని మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతుంది.

IND vs BAN Test Match: టెస్ట్ సిరీస్‌నైనా నెగ్గాలే.. ప్రాక్టీస్‌లో టీమిండియా ఆటగాళ్లు.. (ఫొటో గ్యాలరీ)

ప్రస్తుతం జట్టులో ఏడు స్థానాలు ఖరారు కాగా.. మిగిలిన నాలుగు స్థానాలపై సందిగ్దదత నెలకొంది. వికెట్ కీపర్ స్థానం కోసం పంత్, శ్రీకర్ భరత్ మధ్య పోటీ ఉంది. అయితే వరుస వైఫల్యాలతో సతమతం అవుతున్న పంత్‌ను ఈ మ్యాచ్‌లో తుది జట్టులో ఎంపిక చేయడం కష్టమే. అయితే, పంత్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. వీరిలో ఎవరు మైదానంలోకి వస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆల్ రౌండర్ల బెర్త్‌కు అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ పోటీ పడుతున్నారు. పేసర్ల విభాగంలో ఉమేశ్, సిరాజ్, సైనీ మధ్య పోటీ ఉంది.

IND vs BAN Test Match

IND vs BAN Test Match

భారత్ తుది జట్టు (అంచనా):
ఓపెనర్లుగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, వన్‌ డౌన్‌లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లి, ఐదో ప్లేస్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ పేర్లు ఖరారు కాగా, పంత్‌/ శ్రీకర్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌/సౌరభ్‌ కుమార్‌/ శార్ధూల్‌ ఠాకూర్‌, అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌/ సైనీ