IND vs ENG: రెండో వన్డేకు రెడీ.. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్!

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే పూణే వేదికగా జరగనుంది. ఫస్ట్ మ్యాచ్‌ విక్టరీతో మంచి ఊపుమీదున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడో సిరీస్‌నూ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

IND vs ENG: రెండో వన్డేకు రెడీ.. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్!

Ind Vs Eng Cric

IND vs ENG: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే పూణే వేదికగా జరగనుంది. ఫస్ట్ మ్యాచ్‌ విక్టరీతో మంచి ఊపుమీదున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడో సిరీస్‌నూ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్‌కు డూ ఆర్‌ డై సిచ్యుయేషన్‌తో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. టీ-20, టెస్ట్ సిరీస్‌లో కంగుతిన్న ఇంగ్లాండ్‌.. ఎలాగైనా వన్డే సిరీస్‌ గెలవాలని పట్టుదలగా ఉంది.

జోస్ బట్లర్ కెప్టెన్‌గా..
మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఇవాళ జరగబోయే మ్యాచ్‌తో పాటు మూడో వన్డే మ్యాచ్‌ నుంచి కూడా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తప్పుకున్నాడు. తొలి వన్డేలో చేతికి తీవ్ర గాయం కావడంతో తదుపరి మ్యాచ్‌లకు అతడిని జట్టు నుంచి ఇంగ్లాండ్‌ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ కెప్టెన్ బాధ్యతగా వహించనున్నాడు.

మరోవైపు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిని చిత్తుచేసిన కోహ్లీసేన.. ఇవాళ జరిగే రెండో మ్యాచ్‌లో జయకేతనం ఎగరవేయాలని భావిస్తోంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ సొంతం చేసుకోవాలనుకుంటోంది. ఇక గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన శ్రేయస్‌ స్థానంలో సూర్యకుమార్‌ అరంగేట్రం చేస్తాడా? లేదా పంత్‌ను జట్టులోకి తీసుకుంటారా? అనేది ఆసక్తిని రేపుతోంది. వరుసగా మ్యాచ్‌లాడుతున్న శార్దూల్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చి సిరాజ్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి వన్డేలో టీమిండియా బౌలర్ల ధాటికి ఒకటి తర్వాత ఒకటిగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌.. 42.1 ఓవర్లలో 251 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సేన 1-0తో ఆధిక్యం సొంతం చేసుకున్నట్టయింది.