IND vs ENG 4th T20I : నాల్గో టీ20 : మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌

IND vs ENG 4th T20I : నాల్గో టీ20 : మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌

Ind Vs Eng 4th T20i

IND vs ENG 4th T20I : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్; 12) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా (14) పరుగులకే చేతులేత్తేశాడు. రాహుల్ స్థానంలో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీని (1)రషీద్ బౌలింగ్‌లో బట్లర్ స్టంప్ ఔట్ చేశాడు.

70స్కోరు వద్ద భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ స్థానంలో రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుని.. భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు.

రోహిత్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి రోహిత్ (12) ఔటయ్యాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్ నిలకడగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి సూర్యకుమార్ (37), రిషబ్ పంత్ (3, నాటౌట్)లతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, రషీద్, స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.


మూడో టీ20లో ఇంగ్లండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కోహ్లీసేన సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిరీస్‌లో 1-2తో భారత్‌ వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.