Ind Vs Nz : అరంగ్రేటంలోనే అదరగొట్టిన అయ్యర్.. రాణించిన జడేజా.. భారీ స్కోర్‌పై భారత్ గురి

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 84 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు..

Ind Vs Nz : అరంగ్రేటంలోనే అదరగొట్టిన అయ్యర్.. రాణించిన జడేజా.. భారీ స్కోర్‌పై భారత్ గురి

Ind Vs Nz

Ind Vs Nz : కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 84 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆడుతున్న తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ రాణించాడు. 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహకారం అందించాడు. జడేజా 100 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్ 13 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (52) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ కోలుకుంది. పుజారా (26), కెప్టెన్ రహానె (35) నిరాశ పరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. సౌథీకి ఓ వికెట్ దక్కింది.

Chrome Password Checker : మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్ల చేతుల్లో.. అయితే డౌటే.. ఇలా చెక్ చేసుకోండి!

తొలి రోజు టీమిండియా మంచి స్కోరే చేసింది. అయితే టీమిండియా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. టెస్టుల్లో టీమిండియాకు బ్యాటింగ్‌లో గోడగా భావించే పుజారా సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో చివరిసారిగా పుజారా సెంచరీ చేశాడు. ఆ టెస్టులో పుజారా 193 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అతడు ఆడిన 22 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో పుజారాపై అంచనాలు ఉండగా.. అతడు నిరాశపరిచాడు.

రహానే ఔటైన తీరుపై సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు విపరీతమైన ట్రోల్స్‌ చేశారు. పుజారా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం రానున్న టెస్టుల్లో వీరిద్దరి స్థానాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు రహానే, పుజారాలకు పెద్దగా నష్టం లేకపోయినప్పటికి.. భవిష్యత్తులో అయ్యర్‌ లాంటి ఆటగాడి వల్ల జట్టులో చోటు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విశ్లేషణ వినిపిస్తోంది.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ఎందుకంటే?

కాగా, టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ డెబ్యూ టెస్టు మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. సీనియర్లు రహానే, పుజారాలు విఫలమైన వేళ శ్రేయాస్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అయితే ఇప్పుడు అయ్యర్‌ ఇన్నింగ్స్‌ పుజారా, రహానేలను ఇరకాటంలో పడేసేలా ఉంది. అసలే ఫామ్‌ లేక తంటాలు పడుతున్న వీరిద్దరికి అయ్యర్‌ ఇన్నింగ్స్‌ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.