రాహుల్, శ్రేయస్ మెరుపులు : 2-0తో టీమిండియా ఆధిక్యం

  • Published By: madhu ,Published On : January 26, 2020 / 10:10 AM IST
రాహుల్, శ్రేయస్ మెరుపులు : 2-0తో టీమిండియా ఆధిక్యం

టీమిండియా..న్యూజిలాండ్ జట్టుకు షాక్ ఇస్తోంది. వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ ఆ జట్టును వత్తిడిలో పడేస్తోంది. రెండో టీ -20లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ -20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. న్యూజిలాండ్ జట్టు విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది టీమిండియా.

ఓపెనర్ శర్మ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా..మిగతా బ్యాట్స్ మెన్స్ చక్కగా రాణించారు. మరో ఓపెనర్ రాహుల్ కివీస్ బౌలర్ల భరతం పట్టారు. ఫోర్లు, సిక్స్‌లతో అదరగొట్టాడు. 50 బంతులను ఎదుర్కొన్న రాహుల్..3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతనికి తోడుగా ఉన్న కెప్టెన్ కోహ్లీ తక్కువ స్కోరుకే వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు.

నాలుగో బ్యాట్స్ మెన్‌గా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 33 బంతులను ఎదుర్కొన్న అయ్యర్..1 ఫోర్, 3 సిక్స్‌ల సహాయంతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దూబే 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. 

తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. గుప్టిల్ 33, మన్రో 26,  సైఫెర్ట్ 33 నాటౌట్‌గా నిలిచారు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

* న్యూజిలాండ్ స్కోర్ 132/5, భారత్ స్కోర్ – 135/3 (17.3 ఓవర్లు)
* కివీస్ బ్యాటింగ్ : గుప్టిల్ 33, సైఫెర్ట్ 33 నాటౌట్, మన్రో 26, టేలర్ 18, 

* భారత్ బౌలింగ్ : జడేజా 2, బుమ్రా, శివమ్, శార్దూల్‌కు ఒక్కో వికెట్.
* భారత్ బ్యాటింగ్ : కేఎల్ రాహుల్ 57 నాటౌట్, శ్రేయస్ 44, విరాట్ కోహ్లీ 11

Read More : అసెంబ్లీ సమావేశాలకు TDP దూరం : స్పీకర్, ఛైర్మన్‌లతో గవర్నర్ సమావేశాలు