Ind Vs Nz 2nd Test : రెండో రోజు ముగిసిన ఆట.. తిరుగులేని పొజిషన్‌లో భారత్

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసింది. భారత జట్టు ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ముందు బ్యాటర్లు..

Ind Vs Nz 2nd Test : రెండో రోజు ముగిసిన ఆట.. తిరుగులేని పొజిషన్‌లో భారత్

Ind Vs Nz Second Test Match

Ind Vs Nz 2nd Test : ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసింది. భారత జట్టు ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ముందు బ్యాటర్లు, ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. కివీస్ కు దిమ్మతిరిగే షాక్‌ ఇస్తూ.. టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రెండు గంటల్లోనే కేవలం 30 ఓవర్లలోపే న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చారు. అజాజ్ పటేల్ పది వికెట్లు తీశాడన్న ఆనందం కాసేపు కూడా కివీస్ ఆటగాళ్లకు లేకుండా చేశారు.

భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కివీస్‌ను కేవలం 62 పరుగులకే కుప్పకూల్చి తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం (263) సాధించింది.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

ఆ తర్వాత ఫాలో-ఆన్‌ కూడా ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్‌ అగర్వాల్ (75 బంతుల్లో 38*), పుజారా (51 బంతుల్లో 29*) ఉన్నారు. ఫీల్డింగ్‌ చేస్తుండగా కుడి మోచేతికి గాయం కావడంతో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ బ్యాటింగ్‌కు దిగలేదు. అతడి స్థానంలో పుజారా వచ్చాడు. భారత్ ఇప్పటికే 332 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. కాగా, కివీస్ బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ అదరగొట్టాడు. 10కి 10 వికెట్లు తీసి అత్యుతమ ప్రదర్శన కనబరిచాడు.

రెండో టెస్టుపై పూర్తి పట్టు సాధించేందుకు మళ్లీ బ్యాటింగ్‌కు దిగింది భారత్. తొలి టెస్టులో అందినట్టే అంది చేజారిన విజయం ఈసారి మాత్రం మిస్‌ కాకూడదంటే మూడో రోజు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిర్దేశించి మరోసారి వారి భరతం పట్టాల్సిందే. కాగా, ముంబై టెస్టులో టీమిండియా విజయం దాదాపు ఖాయమైనట్టే అని, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గట్టెక్కడం అసాధ్యం అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

WhatsApp New Feature : పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెట్టారా? క్షణాల్లో డిలీట్ చేయొచ్చు!

టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150) అద్భుత సెంచరీ సాయంతో భారత్ 325 పరుగులు చేయగలిగింది. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన మూడో బౌలర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్… భారత బౌలర్ల దాటికి కకావికలమైంది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్ తీశారు.