Ind Vs Nz.. 2nd Test : మూడో రోజు ఆట పూర్తి… విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్

ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల టార్గెట్ ఉంచిన కోహ్లీ సేన... విజయానికి మరో 5 వికెట్ల దూరంలో..

Ind Vs Nz.. 2nd Test : మూడో రోజు ఆట పూర్తి… విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్

Ind Vs Nz 2nd Test

Ind Vs Nz.. 2nd Test : ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల టార్గెట్ ఉంచిన కోహ్లీ సేన… విజయానికి మరో 5 వికెట్ల దూరంలో ఉంది. భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదు. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండగా, డ్రా కోసం ఆడడం కివీస్ శక్తికి మించిన పనే.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోల్స్ (36), రచిన్ రవీంద్ర (2) ఉన్నారు. వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిచెల్ 60 పరుగులు చేశాడు. తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 6, ఓపెనర్ విల్ యంగ్ 20, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 6 పరుగులు చేశారు. వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ టామ్ బ్లండెల్ (0) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా, కివీస్ 62 పరుగులకే ఆలౌటైంది. భారత్ కు కీలకమైన 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 500 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (62), ఛటేశ్వర్ పుజారా (47) తొలి వికెట్ కు 107 పరుగులు జోడించగా, వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మాన్ గిల్ 47 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 36 పరుగులు సాధించాడు. ముఖ్యంగా, అక్షర్ పటేల్ కివీస్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అక్షర్ కేవలం 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు బాది 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ మరోసారి రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 10కి 10 వికెట్లు పడగొట్టిన అజాజ్… రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. ఈ టెస్టులో మొత్తం 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు.