Ind Vs Nz : పదోసారి… టెస్టుల్లో విరాట్ కోహ్లి చెత్త రికార్డ్

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన టెస్ట్ కెరీర్ లో చెత్త రికార్డ్ నెలకొల్పాడు. ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లి వివాదాస్పద రీతిలో..

Ind Vs Nz : పదోసారి… టెస్టుల్లో విరాట్ కోహ్లి చెత్త రికార్డ్

Ind Vs Nz Virat Kohli

Ind Vs Nz : భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన టెస్ట్ కెరీర్ లో చెత్త రికార్డ్ నెలకొల్పాడు. ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లి వివాదాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ అయ్యాడు. దీంతో తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.

స్వదేశంలో భారత కెప్టెన్ గా అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్ గా కోహ్లి నిలిచాడు. గతంలో 5 డకౌట్ లతో ఈ రికార్డు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరిట ఉండేది. ఇప్పుడు 6 డకౌట్ లతో కోహ్లి దానిని బ్రేక్ చేశాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధికంగా డకౌట్ అయిన భారత కెప్టెన్ కూడా కోహ్లినే. టెస్టు క్రికెట్‌లో 10 డకౌట్లు నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

ఓవరాల్ గా చూస్తే.. కెప్టెన్‌గా అత్యధిక సార్లు డకౌటైన వారిలో భారత సారథి విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ మాజీ సారథి స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (13 సార్లు) తొలి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ (10 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పుడు స్మిత్‌ సరసన నిలిచాడు.

Winter Weight Loss : చలికాలంలో వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం ఎలా?

ముంబై టెస్ట్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.