Ind Vs NZ 3rd ODI : తిరుగులేని భారత్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.

Ind Vs NZ 3rd ODI : తిరుగులేని భారత్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs NZ 3rd ODI : సొంతగడ్డపై భారత్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. వరుస సిరీస్ విజయాలతో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత జట్టు.. తాజాగా మూడో వన్డేలోనూ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. కివీస్ కు ఓటమి తప్పలేదు. 386 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్..41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.

Also Read..Mohammed Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి షాకిచ్చిన కోర్టు.. ప్రతీనెల 1.30లక్షలు చెల్లించాల్సిందే ..

కివీస్ ఓపెనర్ కాన్వే క్రీజులోకి వచ్చింది మొదలు దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సెంచరీతో కదం తొక్కాడు. కానీ, జట్టుని మాత్రం గెలిపించలేకపోయాడు. కాన్వే 100 బంతుల్లోనే 138 పరుగులు చేసి ఔటయ్యాడు. కాన్వే ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(85 బంతుల్లో 101), శుభ్ మన్ గిల్ (78 బంతుల్లో 112) సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. గిల్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి.

Also Read..Steve Smith: ఇలాకూడా కొట్టొచ్చా..! క్రీజ్‌లో స్టీవ్ స్మిత్.. ఒక్క బాల్‌కు 16 పరుగులిచ్చిన బౌలర్.. వీడియో వైరల్

న్యూజిలాండ్ తో చివరి వన్డేలో టీమిండియా బ్యాట్స్ మన్ వీరవిహారం చేశారు. పరుగుల వరద పారించారు. ఓపెనర్ల సెంచరీలు, మిడిలార్డర్ లో పాండ్యా హాఫ్ సెంచరీ, శార్దూల్ ఠాకూర్ దూకుడుతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రోహిత్ శర్మ (101), శుభ్ మాన్ గిల్ (112) తొలి వికెట్ కు 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడం ఈ మ్యాచ్ లో హైలైట్.

హార్దిక్ పాండ్యా (38 బంతుల్లో 54), కోహ్లీ 36, శార్దూల్ ఠాకూర్ (17 బంతుల్లో 25) పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 17, సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 3, బ్లెయిర్ టిక్నర్ తలో 3 వికెట్లు పడగొట్టారు. మైఖేల్ బ్రేస్వెల్ 1 వికెట్ తీశాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ సిరీస్ ఆద్యంతం కివీస్ బౌలింగ్ పై భారత్ బ్యాట్స్ మెన్ ఆధిపత్యం కనిపించింది. భారత బ్యాటర్లు కివీస్ బౌలర్లను ఉతికారేశారు. తొలి రెండు వన్డేలు ఓడి సిరీస్ చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టు.. ఆఖరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకుందామని భావించింది. కానీ టీమిండియా భారీ స్కోరు బాదడంతో కివీస్ ఆశలు నెరవేరలేదు. ముచ్చటగా భారత్ కు మూడో విజయం, కివీస్ కు మూడో పరాజయం తప్పలేదు.