IND Vs NZ 3rd T20I : భారత్ భళా.. న్యూజిలాండ్‌తో సిరీస్ క్లీన్ స్వీప్

న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చివరి, మూడో టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటర్లు రాణించారు. తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగారు.

IND Vs NZ 3rd T20I : భారత్ భళా.. న్యూజిలాండ్‌తో సిరీస్ క్లీన్ స్వీప్

India Beats New Zealand

IND Vs NZ 3rd T20I : న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భారత్ అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. చివరి, మూడో టీ20 మ్యాచ్ లోనూ భారత్ మెరిసింది. తొలుత బ్యాటర్లు రాణించారు. తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో కివీస్ పై 73 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3-0 తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 185 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి 17.2 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కివీస్ బ్యాటర్లలో ఓపెన్ మార్టిన్ గప్తిల్ మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు, హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశారు. యజువేంద్ర చాహల్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్ తలో వికెట్ తీశారు. రెగ్యులర్ కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలి సిరీస్ గెలిపించాడు.

మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో నెగ్గిన టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. న్యూజిలాండ్‌కు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ కెప్టెన్‌ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో (56) చెలరేగాడు. ఈ సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు భారీ స్కోర్ చేసింది.

Sonu Sood : వైసీపీ నేతల వైఖరి సరికాదన్న సోనూసూద్.. చంద్రబాబుకి ఫోన్‌లో పరామర్శ

కేఎల్‌ రాహుల్‌ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్ (29) ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. రోహిత్-ఇషాన్‌ కలిసి తొలి వికెట్‌కు అర్ధశతక (69) భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఇషాన్‌తోపాటు సూర్యకుమార్‌ (0), రిషభ్‌ పంత్ (4) స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్ (25)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో 26వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

రోహిత్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెంకటేశ్‌ అయ్యర్ (20) వేగంగా పరుగులు చేశాడు. అయితే శ్రేయస్‌, వెంకటేశ్‌ వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో హర్షల్‌ పటేల్ (18), దీపక్‌ చాహర్ (21) ధాటిగా ఆడారు. కివీస్‌ బౌలర్లలో సాంట్నర్ 3.. ట్రెంట్ బౌల్ట్, మిల్నే, ఫెర్గూసన్, సోధీ తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో బౌలర్ దీపక్ చాహర్ చివరిలో వచ్చి బ్యాటింగ్ లో అదరగొట్టాడు. కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. కాగా, దీపక్ బాదిన సిక్సర్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచే సెల్యూట్ చేశాడు. గుడ్ షాట్ అంటూ అభినందించాడు. కాగా చివరి ఓవర్లో దీపక్ చాహర్, హర్షల్ పటేల్ పోరాటంతో టీమిండియాకు భారీ స్కోర్ వచ్చింది.

Instant Covid Test : కాఫీతో కోవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!

రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ రికార్డు విరాట్ కోహ్లి(29 సార్లు) పేరు మీద ఉండేది. ఇప్పుడు దాన్ని రోహిత్(30 సార్లు) చెరిపేశాడు. రోహిత్ 30 సార్లు 50+కి పైగా పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సార్లు 50 ప్లస్ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీని (123 సార్లు) వెనక్కి నెట్టి రోహిత్ శర్మ (124 సార్లు) ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ (264) టాప్‌లో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ (193), విరాట్ కోహ్లీ (188), సౌరబ్ గంగూలీ (144) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.