Ind Vs NZ 3rd T20I : గిల్ సూపర్ సెంచరీ.. కివీస్ ముందు కొండంత లక్ష్యం

న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. టీమిండియా నయా సంచలనం, ఓపెనర్ శుభ్ మన్ గిల్ చెలరేగిపోయాడు. సూపర్ సెంచరీ బాదాడు. 63 బంతుల్లోనే 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.(Ind Vs NZ 3rd T20I)

Ind Vs NZ 3rd T20I : గిల్ సూపర్ సెంచరీ.. కివీస్ ముందు కొండంత లక్ష్యం

Ind Vs NZ 3rd T20I : న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. టీమిండియా నయా సంచలనం, ఓపెనర్ శుభ్ మన్ గిల్ చెలరేగిపోయాడు. సూపర్ సెంచరీ బాదాడు. 63 బంతుల్లోనే 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. గిల్ భారీ షాట్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Also Read..Future of test cricket: టెస్టు క్రికెట్ భ‌విష్య‌త్తుపై ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఆందోళ‌న

రాహుల్ త్రిపాఠి(22 బంతుల్లో 44), హార్ధిక్ పాండ్యా(17 బంతుల్లో 30), సూర్యకుమార్ యాదవ్(13 బంతుల్లో 24) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. ఫెర్గుసన్ 4 ఓవర్లలో 54 పరుగులు ఇవ్వగా, టిక్నర్ 3 ఓవర్లలోనే 50 రన్స్ సమర్పించుకున్నాడు.

Also Read..Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్.. డిశ్చార్జి ఎప్పుడంటే

కివీస్ ముందు టీమిండియా కొండంత (235 రన్స్) లక్ష్యాన్ని నిర్దేశించింది. గిల్ ఆరంభం నుంచే బౌండరీలతో చెలరేగిపోయాడు. పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 54 బంతుల్లోనే 5 సిక్సులు, 10 ఫోర్లతో సెంచరీ బాదాడు. మొత్తంగా అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20 కెరీర్ లో గిల్ కు ఇదే తొలి సెంచరీ. మూడో టీ20 మ్యాచ్ కి అహ్మదాబాద్ వేదికైంది.(Ind Vs NZ 3rd T20I)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ చిన్న వయసులోనే రికార్డులను బద్దలు కొడుతున్నాడు. మూడో టీ20లో న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన 23ఏళ్ల ఈ యువ సంచలనం.. అన్ని ఫార్మాట్లలో శతకాన్ని బాదేసి.. అతి తక్కువ వయసులో ఈ ఫీట్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ఇతడే. అంతేకాదు టీ20ల్లో భారత్ తరపున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ భవిష్యత్ ఆశాకిరణంగా మారాడు శుభ్ మన్ గిల్.(Ind Vs NZ 3rd T20I)