Ind Vs Nz : మూడో రోజు ముగిసిన ఆట.. 63 రన్స్ లీడ్‌లో భారత్

మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(1)ను కివీస్ బౌలర్ జేమీసన్ బౌల్డ్..

Ind Vs Nz : మూడో రోజు ముగిసిన ఆట.. 63 రన్స్ లీడ్‌లో భారత్

Ind Vs Nz Third Test

Ind Vs Nz : కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(1)ను కివీస్ బౌలర్ జేమీసన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్ (4), పుజారా (9) ఉన్నారు. నాలుగో రోజు ఆటలో మనోళ్లు ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్ 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మూడో రోజు ఆటలో భారత బౌలర్లు రాణించారు. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగారు. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా, అశ్విన్ 3 వికెట్లు తీశాడు. జడేజా, పేసర్ ఉమేశ్ యాదవ్ తలో వికెట్ దక్కింది. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం అక్షర్ కు ఇది ఐదోసారి.

Microsoft Free Trick : ఈ ట్రిక్‌తో MS Office సాఫ్ట్‌వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

అంతకుముందు 129 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్…. 151 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 89 పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్ అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అక్కడ్నించి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. నిన్నటి ఆటలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన టీమిండియా స్పిన్నర్లు… నేడు రెండో సెషన్ లో చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ 18, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 11, కైల్ జేమీసన్ 23 పరుగులు చేశారు. భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర (13)ను రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు.

New House : కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…ఎందుకు

కాగా, తొలి టెస్టులో అంపైర్ల తప్పిదాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చెత్త అంపైరింగ్‌తో అంపైర్లు నితిన్ మీనన్, వీరేందర్ శర్మ విమర్శల పాలయ్యారు. మూడు రోజుల ఆటలో వీరిద్దరూ ఐదు తప్పిదాలకు పాల్పడినట్లు కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. ఈ టెస్టులో భారత బౌలర్లకు కొరకాని కొయ్యగా మారిన టామ్ లాథమ్‌ 66 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అశ్విన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్ నాటౌట్‌ ఇచ్చాడు. ఆజింక్యా రహానె రివ్యూ తీసుకోకపోవడంతో లాథమ్ బతికిపోయాడు. అంతకుముందు పలు మార్లు రివ్యూలలో లాథమ్ బతికిపోయాడు. దీంతో రహానె రివ్యూ తీసుకునేందుకు ఇష్టపడలేదు.