Kanpur Test: నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇక బౌలర్లే డిసైడర్లు

కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

Kanpur Test: నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇక బౌలర్లే డిసైడర్లు

Saaha

Kanpur Test: కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. శ్రేయాస్ అయ్యర్, సాహా, కెప్టెన్ రహానేలు హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. దీని తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం 283 పరుగులకు చేరుకుంది.

న్యూజిలాండ్ గెలవాలంటే 284 పరుగులు చేయాల్సి ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేయగలిగింది. విజయానికి న్యూజిలాండ్‌కు 280 పరుగులు అవసరం. టామ్ లాథమ్, విలియం సోమర్‌విల్లే క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 14/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఛెతేశ్వర్ పుజారా, కెప్టెన్ అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా వెంటవెంటనే అవుట్ అయిన సమయంలో శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32)లు బాధ్యతాయుతంగా ఆడడంతో మ్యాచ్ గట్టెక్కింది.

ఆఖర్లో వృద్ధిమాన్ సహా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 126 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 61 పరుగులు చేశాడు సహా. అక్షర్ పటేల్ 28పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఏడు వికెట్ల నష్టానికి 234 చేసింది.

టీమిండియా ఆధిక్యం 283 పరుగులకు చేరుకోవడంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పర్యాటక జట్టులో సౌథీ, జెమీసన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అజాజ్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక మ్యాచ్ ఒక్కరోజే మిగిలి ఉండగా భారత బౌలర్లే మ్యాచ్ డిసైడర్లు కానున్నారు.