IND Vs NZ : రెండో టీ20లో కివీస్‌పై భారత్ ఘనవిజయం, సిరీస్ కైవసం

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్ ను

IND Vs NZ : రెండో టీ20లో కివీస్‌పై భారత్ ఘనవిజయం, సిరీస్ కైవసం

India Beat New Zealand

IND Vs NZ : న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్ ను 17.2 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి చేధించింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 టీ20ల సిరీస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ ఆల్ రౌండ్ షో అదరగొట్టింది. తొలుత బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(49 బంతుల్లో 65), కెప్టెన్ రోహిత్ శర్మ(36 బంతుల్లో 55) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. వీరి జోడీ శుభారంభం ఇచ్చింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు తీశాడు.

Aadhaar-BHIM : గుడ్ న్యూస్.. ఇకపై మీ ఆధార్ నెంబర్‌తో డబ్బులు పంపుకోవచ్చు!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత్‌ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ ద్వారా హర్షల్‌ పటేల్‌ భారత టీ20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. సిరాజ్‌ బదులు తుది జట్టులోకి వచ్చాడు. భారీ స్కోరు సాధిస్తుందనుకున్న కివీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్ (31), డారిల్‌ మిచెల్ (31) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే గప్తిల్‌ ఔటైన తర్వాత కివీస్‌ పరుగుల వేగం తగ్గింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. మిడిలార్డర్‌ బ్యాటర్లు మార్క్‌ చాప్‌మన్ (21), గ్లెన్‌ ఫిలిప్స్‌ (34) దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది.

మిగిలిన బ్యాటర్లలో సీఫర్ట్‌ 13, నీషమ్‌ 3, సాట్నర్ 8*, మిల్నే 5* పరుగులు చేశారు. అరంగేట్ర బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ (2/25) రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. భారత బౌలర్లలో హర్షల్‌ 2.. దీపక్‌ చాహర్, భువనేశ్వర్‌, అక్షర్‌ పటేల్, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

టీమిండియా పేసర్‌ హర్షల్‌ పటేల్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ ద్వారా 94వ ఆటగాడిగా టీమిండియా తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్‌ పటేల్‌ 25 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. హర్షల్‌ తాను వేసిన ప్రతీ బంతి దాదాపు 140 కిమీ వేగంతో విసరడం విశేషం. అలా తన డెబ్యూ మ్యాచ్‌తోనే హర్షల్‌ ప్రశంసలు అందుకున్నాడు. కాగా, రెగులర్ కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలి సిరీస్ లోనే సత్తా చాటాడు. కెప్టెన్ రోహిత్‌.. కోచ్‌ ద్రవిడ్‌ ఈ మ్యాచ్‌తోనే తొలి సిరీస్‌ గెలుపును ఖాతాలో వేసుకున్నారు.