Ind Vs NZ 1st ODI : ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై భారత్ విజయం.. సెంచరీతో చెమట్లు పట్టించిన బ్రేస్ వెల్

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఈ ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 337 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. (Ind Vs NZ 1st ODI)

Ind Vs NZ 1st ODI : ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై భారత్ విజయం.. సెంచరీతో చెమట్లు పట్టించిన బ్రేస్ వెల్

Ind Vs NZ 1st ODI : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఈ ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 337 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.

130 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్ ను.. బ్రేస్ వెల్(140), శాంట్నర్(57) జోడీ గెలిపించేంత పని చేసింది. ముఖ్యంగా మైఖల్ బ్రేస్ వాల్ సెంచరీతో చెలరేగాడు. పరుగుల వరద పారించాడు. క్రీజులో ఉన్నంత సేపు దడదడలాడించాడు. 78 బంతుల్లో 140 పరుగులు చేసిన బ్రేస్వెల్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు 12 ఫోర్లు, 10 భారీ సిక్స్ లతో భారత్ ను హడలెత్తించాడు. ఇతడి ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు.

కాగా, భారత బౌలర్ సిరాజ్.. శాంట్నర్ ను ఔట్ చేశాడు. తర్వాత బ్రేస్ వెల్ పోరాడినా ప్రయోజం లేకపోయింది. కివీస్ కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.

Also Read..Brij Bhushan Sharan: ఆ ఆరోపణలు నిజమని తేలితే ఉరేసుకుంటా: రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ హోరాహోరిగా సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా న్యూజిలాండ్ పోరాడింది. లక్ష్యం భారీగా ఉన్నా కివీస్ గట్టిగానే పోరాడింది. న్యూజిలాండ్ క్రికెటర్ మైకేల్ బ్రేస్ వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ మ్యాచ్ లో అతడు సంచలన ఇన్నింగ్స్ తో టీమిండియాను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లాడు. చివర్లో బ్రేస్ వెల్ ను శార్దూల్ ఠాకూర్ ఓ యార్కర్ తో ఎల్బీడబ్ల్యూ చేయడంతో టీమిండియా 12 పరుగుల తేడాతో గట్టెక్కింది. 350 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆఖర్లో కివీస్ విజయానికి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా, శార్దూల్ ఠాకూర్ విసిరిన తొలి బంతినే బ్రేస్వెల్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత బంతి వైడ్ గా వెళ్లడంతో సమీకరణం 5 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అయితే, శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన బంతితో బ్రేస్వెల్ వీరోచిత ఇన్నింగ్స్ కు ముగింపు పలికాడు.

అసలు, న్యూజిలాండ్ ఇంత దూరం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఓ దశలో ఆ జట్టు 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే, బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్ జోడీ ఎదురుదాడికి దిగింది. దాంతో అసాధ్యమనుకున్న లక్ష్యం క్రమంగా కరిగిపోవడం ప్రారంభించింది. ఈ దశలో భారత్ భారీగా పరుగులు సమర్పించుకుంది. శాంట్నర్ 45 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అయితే శాంట్నర్ ను సిరాజ్ అవుట్ చేయడంతో భారత్ కు ఊరట లభించింది.

Also Read..Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోరు

అదే ఓవర్లో సిరాజ్.. హెన్రీ షిప్లేను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత లాకీ ఫెర్గుసన్ ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ కు పంపడంతో న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కివీస్ బ్యాటర్లు హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేసుకుని విజృంభించారు. గతి తప్పిన బౌలింగ్ తో నిరాశపరిచిన పాండ్యా 7 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ డబుల్ సెంచరీతో (208) అదరగొట్టాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో కివీస్ చివరి వరకు పోరాడి ఓడింది.(Ind Vs NZ 1st ODI)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ సిక్సర్లు, ఫోర్ల మోత మోగించాడు. డబుల్ సెంచరీ బాదాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ 23 ఏళ్ల రైట్ హ్యాండర్ 149 బంతుల్లో 208 పరుగులు చేయడం విశేషం. గిల్ స్కోరులో 19 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన గిల్.. డబుల్ సంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక, ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో లీడ్ లో ఉంది. ఈ నెల 21న రాయ్ పూర్ లో రెండో వన్డే జరగనుంది.

Ind Vs NZ 1st ODI