Virat Kohli : జైలుకి పంపాలి, సీబీఐ విచారణ జరపాలి.. కోహ్లీ ఔట్‌పై వివాదం, టీవీ అంపైర్‌పై తీవ్ర విమర్శలు

కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యరీతిలో డకౌట్ అయ్యాడు. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా, కోహ్లీ ఔట్ పై వివాదం చెలరేగింది. టీవీ..

10TV Telugu News

Virat Kohli : ముంబై వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యరీతిలో డకౌట్ అయ్యాడు. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా, కోహ్లీ ఔట్ పై వివాదం చెలరేగింది. టీవీ అంపైర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

బంతి ప్యాడ్లకు తగిలిందని భావించిన ఫీల్డ్ అంపైర్ ఔట్ అంటూ వేలెత్తగా, కోహ్లీ రివ్యూ కోరాడు. అయితే రివ్యూలో బంతి బ్యాట్ కు తగిలినట్టుగా కనిపించింది. కానీ టీవీ అంపైర్ కూడా ఔటిచ్చాడు. దాంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

Tanzanian Siblings : బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ను లిప్ సింక్‌తో ఊపేశారు.. ఎవరీ టాంజానియా అన్నాచెల్లెళ్లు..!

దీనిపై సీబీఐ విచారణ అవసరం అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. థర్డ్ అంపైర్ ను కటకటాల వెనక్కి నెట్టాలంటూ డిమాండ్ చేశాడు. మరో నెటిజన్ థర్డ్ అంపైర్ ను కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారితో పోల్చాడు. పార్థివ్ పటేల్ వంటి సీనియర్ ఆటగాడు కూడా ఇది అంపైర్ తప్పిదమేనని తేల్చి చెప్పాడు. కనీస జ్ఞానం కొరవడింది అంటూ మాజీ ఆటగాడు వసీం జాఫర్ విమర్శించాడు.

కాగా, పాత కక్షలతోనే వీరేందర్ శర్మ.. కోహ్లిని.. ఔట్‌గా ప్రకటించాడని ఓ నెటిజన్ కామెంట్‌ చేశాడు. గతంలో ఐపీఎల్‌లో వీరేందర్ శర్మ నిర్ణయాల పట్ల చాలా సార్లు కోహ్లి గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించిన ఫొటోలును అభిమానులు ప్రస్తుతం ట్రోల్‌ చేస్తున్నారు.

ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో.. విరాట్‌ కోహ్లి ఢిపెన్స్‌ ఆడడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి మిస్ అయ్యి ప్యాడ్స్‌ని తాకింది. దీంతో బౌలర్‌ అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి ఔట్‌ గా ప్రకటించాడు. అయితే వెంటనే కోహ్లి రివ్యూకు వెళ్లాడు. రీప్లేలో బంతి మొదట బ్యాట్‌కి తగిలి ప్యాడ్‌కి తగిలినట్లుగా అనిపించింది. రీప్లేలో పలు కోణాల్లో విజువల్స్ పరిశీలించిన థర్డ్ అంపైర్‌ వీరేందర్ శర్మకు దాన్ని నిర్ధారించడం కష్టంగా మారింది.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్‌లను తాకడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి చెందాడు. తీవ్ర నిరాశతో మైదానం వీడాడు. కాగా పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో బౌండరీ రోప్‌లను తన బ్యాట్‌తో కొట్టాడు కోహ్లీ. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇదేం చెత్త అంపైరింగ్‌.. కళ్లు కనిపించడం లేదా అంటూ ఓ నెటిజన్ కామెంట్‌ చేయగా.. మరో యూజర్‌ పాత కక్షలతోనే వీరేందర్ శర్మ ఔట్‌గా ప్రకటించాడని కామెంట్‌ చేశాడు. కాగా గతంలో ఐపీఎల్‌లో వీరేందర్ శర్మ నిర్ణయాల పట్ల చాలా సార్లు కోహ్లి గొడవపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలును అభిమానులు ప్రస్తుతం ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ మ్యాచ్ లో డకౌట్ కావడంతో తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లి. స్వదేశంలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్ గా కోహ్లి నిలిచాడు. గతంలో 5 డకౌట్ లతో ఈ రికార్డు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరిట ఉండేది. ఇప్పుడు 6 డకౌట్ లతో కోహ్లి దానిని బ్రేక్ చేశాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధికంగా డకౌట్ అయిన భారత కెప్టెన్ కూడా కోహ్లినే. టెస్టు క్రికెట్‌లో 10 డకౌట్లు నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

ఓవరాల్ గా చూస్తే.. కెప్టెన్‌గా అత్యధిక సార్లు డకౌటైన వారిలో భారత సారథి విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ మాజీ సారథి స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (13 సార్లు) తొలి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ (10 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పుడు స్మిత్‌
సరసన నిలిచాడు.

×